TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం!

TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్!

ఫిబ్రవరిలో ప్రభాస్ భారీ ప్లానింగ్ కల్కి 2, సందీప్ వంగా స్పిరిట్ సినిమాల షూటింగ్ అప్‌డేట్స్.. డార్లింగ్ బాక్సాఫీస్ వేట మళ్లీ మొదలైనట్లే.

Published : 2026-01-28 19:31:00

టాలీవుడ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. గతేడాది విడుదలైన 'ది రాజా సాబ్' అభిమానులను ఊరించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ వెలితిని తీర్చేందుకు ప్రభాస్ ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులతో రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ప్రభాస్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉండబోతోందంటే, భారతీయ సినిమా చరిత్రలో ఒక అగ్ర కథానాయకుడు ఇలా ఏకకాలంలో రెండు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో పాల్గొనడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

భారీ అప్డేట్ ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రభాస్ ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ ఫ్యూచరిస్టిక్ ప్రపంచానికి సంబంధించిన రెండో భాగం స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, సిద్ధంగా ఉంచారు. మొదటి భాగంలో కేవలం పరిచయానికే పరిమితమైన పాత్రలు, రెండో భాగంలో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతాయని సమాచారం. భైరవ పాత్రలో రెబల్ స్టార్ మళ్లీ అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతుండటంతో కల్కి ఫ్యాన్స్ ఇప్పుడే సందడి మొదలుపెట్టారు.

ఫిబ్రవరి 15న సందీప్ వంగా 'స్పిరిట్' జాతర ఇక సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ స్పిరిట్ యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ను ఎలా చూపిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ పరిసరాల్లో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఈ షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌గా పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తారన్న వార్త  నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ రెండు సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది. అంటే ఒకే నెలలో మూడు భారీ చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటూ ప్రభాస్ రికార్డు సృష్టిస్తున్నారు. ఉదయం ఒక సినిమా సెట్‌లో, సాయంత్రం మరో సినిమా చర్చల్లో ప్రభాస్ నిరంతరం శ్రమిస్తున్నారు. 'ది రాజా సాబ్' ఫలితాన్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా, తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతానికి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ ఫిబ్రవరి నుంచి డార్లింగ్ స్పీడ్ పెంచడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు వినపడుతుంది. భారీ గ్రాఫిక్స్‌తో కూడిన కల్కి 2 రా వైలెన్స్‌తో నిండిన స్పిరిట్.. ఈ రెండు విభిన్న కోణాలను ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఏదేమైనా 2026 సంవత్సరం ప్రభాస్  ప్రత్యేకమైన సంవత్సరం గా  సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →