Prakasam Barrage: మున్నేరు వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల!

Prakasam Barrage: మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Prakasam Barrage
Prakasam Barrage

ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద నీరు.. 4 గేట్లు ఎత్తిన అధికారులు..

సముద్రంలోకి 2,900 క్యూసెక్కుల వరద నీరు విడుదల..

విజయవాడ: మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రకాశం బ్యారేజీకి చెందిన 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి సుమారు 2,900 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే బందరు కాలువ, రైవస్ కాలువల ద్వారా మరో 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహం మరో 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని కోరారు. వరద పరిస్థితులపై సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Be the first to react

Latest