Chandrababu: సింగపూర్ పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!

Chandrababu: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయల్దేరారు.

Chandrababu
Chandrababu

ఏపీ అభివృద్ధికి పెట్టుబడుల వేట.. సింగపూర్లో సీఎం చంద్రబాబు సమావేశాలు..

సింగపూర్ ప్రధానితో భేటీ కానున్న సీఎం.. రాష్ట్ర అవకాశాలపై చర్చ..

అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయల్దేరారు.

బెంగళూరు నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన ఇవాళ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు.

రేపు సింగపూర్ ప్రధాన మంత్రి సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి అవకాశాలపై వారితో చర్చించనున్నారు.

అలాగే ఎల్లుండి నిర్వహించనున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఆధునిక నగరాల అభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

ఈ నెల 16వ తేదీ సాయంత్రం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

Be the first to react

Latest