Vijayawada: కేశినేని నాని ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్.. రూ.120 కోట్ల బ్యాంక్ స్కామ్ ఆరోపణలు!

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో మరోసారి కేశినేని కుటుంబానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. తనపై కేశినేని నాని చేసిన ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. నానిపై రూ.120 కోట్ల బ్యాంక్ రుణం వ్యవహారంలో ఆరోపణలు చేస్తూ, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Vijayawada
Vijayawada

విజయవాడలో రాజకీయ వేడి.. కేశినేని నానిపై ఎంపీ చిన్నిని ఆరోపణలు..

రూ.120 కోట్ల బ్యాంక్ రుణ వ్యవహారంపై కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో మరోసారి కేశినేని కుటుంబానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. తనపై కేశినేని నాని చేసిన ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. నానిపై రూ.120 కోట్ల బ్యాంక్ రుణం వ్యవహారంలో ఆరోపణలు చేస్తూ, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

కేశినేని నాని విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్కు పాల్పడ్డారని చిన్ని ఆరోపించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుంచి రూ.120 కోట్ల రుణం తీసుకుని, దాన్ని నిరర్థక ఆస్తిగా (NPA) మార్చి 11 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. భారీ స్థాయి ఆర్థిక వ్యవహారంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ప్రజల సొమ్ముతో కేశినేని నాని విలాసాలు చేస్తున్నారని విమర్శించారు. రూ.120 కోట్ల రుణాన్ని చెల్లించకుండా తప్పించుకునేందుకే రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరారని అన్నారు.

గతంలో విజయసాయిరెడ్డిని తన ఇంటికి పిలిచి చర్చలు జరిపారని, టీడీపీలో ఉంటూనే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఎంపీ చిన్ని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

తనపై చేస్తున్న ఆరోపణలకు కేశినేని నాని ఆధారాలు చూపించాలని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఈ వ్యవహారం విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Be the first to react

Latest