Kondapalli Srinivas: విజయనగరంలో యోగాంధ్ర కార్యక్రమం.. 4000 మందితో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు!

Kondapalli Srinivas: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Kondapalli Srinivas
Kondapalli Srinivas

అంకన్న చెరువు వద్ద యోగా వేడుకలు.. పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

విజయనగరం: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.

చెరువు గట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు అర కిలోమీటర్ మేర ఉపాధి హామీ కూలీలు కూర్చుని యోగాసనాలు వేయడం ఆకట్టుకుంది. మొత్తం 4 వేల మంది ఉపాధి హామీ వేతనదారులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా భారతదేశ పూర్వీకులు ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. కరోనా సమయంలో యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం తన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి చెప్పారు. యోగాలో వందలాది మంది పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదే ఉత్సాహాన్ని ప్రతిరోజూ కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోజువారీ పనులతో అలసిపోయే మహిళలకు యోగా శారీరక, మానసిక విశ్రాంతిని అందిస్తుందని మంత్రి అన్నారు. శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచే సాధన యోగా అని పేర్కొన్నారు.

కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ యోగా మనిషి శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం అరగంట వ్యాయామం లేదా యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించవచ్చని సూచించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో మరింత పెంచింది.

Be the first to react

Latest