Palla Srinivasarao: స్టీల్ ప్లాంట్ కార్మికుడు సూరిబాబు మృతి.. పల్లా శ్రీనివాసరావు సంతాపం!

Palla Srinivasarao: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు గారు శనివారం మృతి చెందారు. ఆయన మృతిపట్ల గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Palla Srinivasarao
Palla Srinivasarao

సూరిబాబు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పల్లా.. కుటుంబ సభ్యులకు పరామర్శ..

స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై పల్లా స్పందన.. భద్రతా చర్యలు బలోపేతం చేయాలని సూచన..

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు గారు శనివారం మృతి చెందారు. ఆయన మృతిపట్ల గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సూరిబాబు మృతి విషయం తెలుసుకున్న వెంటనే పల్లా శ్రీనివాసరావు కేజీహెచ్కు చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సూరిబాబు కుటుంబానికి అందాల్సిన సహాయ చర్యలపై అధికారులు, సంబంధిత వర్గాలతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పోస్ట్మార్టం సహా అన్ని అధికారిక ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫున అందాల్సిన నష్టపరిహారం, ఇతర ఆర్థిక సహాయాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్మికుల శ్రమతోనే పరిశ్రమలు ముందుకు సాగుతున్నాయని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పల్లా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్లో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా యాజమాన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం అవసరమైన భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని ఆయన కోరారు. సూరిబాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Be the first to react

Latest