ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో..
విలియంసన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా..
అమెరికాలో తెలుగు కమ్యూనిటీని క్రీడల ద్వారా మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో టెనెసీ తెలుగు సమితి ప్రతిష్టాత్మకంగా ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ను నిర్వహించనుంది. క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ టోర్నమెంట్ మే 30, 2026న బ్రెంట్ వుడ్ లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచే పోటీలు ప్రారంభం కానున్నాయి. విలియంసన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఈ క్రీడా వేడుక నిర్వహించనున్నారు.
పోటీల్లో పాల్గొనే ప్రతి జట్టుకు 40 డాలర్ల ప్రవేశ రుసుము నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే జట్లకు అవకాశం ఉండటంతో ఆసక్తి గల క్రీడాకారులు ముందుగానే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
టోర్నమెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విష్ణును 408-893-9751 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు కమ్యూనిటీ సభ్యులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని టెనెసీ తెలుగు సమితి ప్రతినిధులు ఆహ్వానించారు. క్రీడాస్ఫూర్తితో పాటు స్నేహబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.