ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

దేశంలో మొదటి బుల్లెట్ రైలు (Bullet train) ను నడపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ముంబై (Mumbai) అహ్మదాబాద్ (Ahmedabad) మధ్య నడిచే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం వందల కిలోమీటర్ల ట్రాక్ పూర్తవుతుండగా.. ఈ రైలు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య ఒక పొడవైన సొరంగం గుండా కూడా వెళ్తుంది. ఈ సొరంగంలో ఒక భాగం నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్ నిర్మాణంలో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొంది.

ఇది కూడా చదవండి: UIDAI: 5-7 ఏళ్ల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించారా.... లేకపోతే డీయాక్టివేషన్!

అంతే కాకుండా 310 కిలోమీటర్ల పైవంతెన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినట్లు వెల్లడించింది. భారతీయ రైల్వే (Indian Railways) దీనిని పెద్ద విజయంగా అభివర్ణించింది. దీనితో పాటు ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త E10 షింకన్‌సేన్ రైళ్లను చేర్చడానికి జపాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 508 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టు భారత్, జపాన్ మధ్య ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. ఈ ప్రాజెక్టు పూర్తికావడం దేశంలో భవిష్యత్తులో నిర్మించబడే బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు విజయం దేశంలో భవిష్యత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు పునాది వేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొనబడింది.

ఇది కూడా చదవండి: BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

ఇతర కారిడార్లను కూడా చురుకుగా పరిశీలిస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ట్రాక్‌లను వేయడం, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను నిర్మించడం, స్టేషన్లు, వంతెనల పని వేగంగా జరుగుతోందని పేర్కొంది. మహారాష్ట్రలో కూడా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే ఆపరేషన్, నియంత్రణ వ్యవస్థల కొనుగోలు ప్రక్రియ కూడా సజావుగా జరుగుతోంది.ప్రభుత్వ సమాచారం ప్రకారం, భారతదేశం (India), జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం జపాన్‌లో నడుస్తున్న E5 షింకన్‌సేన్ రైళ్లను మించిన నూతన తరం E10 రైళ్లు భారత బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో నడిచేలా జపాన్ అంగీకరించిందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Chandrababu Meeting: అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆ శిక్షణా కేంద్రం పెట్టండి.. కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్!

మొత్తం 508 కిలోమీటర్ల ప్రాజెక్టు జపాన్ షింకన్‌సేన్ టెక్నాలజీ (Japan Shinkansen technology) ఆధారంగా అభివృద్ధి చెందుతోంది. E10 రైళ్లు భారత్, జపాన్‌లో ఒకేసారి ప్రారంభించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు కింద నదిపై నిర్మించబడుతున్న 15 వంతెనల పని పూర్తియిందని.. అయితే నాలుగు వంతెనల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 12 స్టేషన్లలో 5 స్టేషన్ల పని పూర్తయింది. మరో 3 స్టేషన్ల పని ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. బీకేసీ స్టేషన్ ఇంజనీరింగ్ (BKC Station Engineering) అద్భుతంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ స్టేషన్ భూమికి 32.5 మీటర్ల కింద ఉంటుంది. దీని పునాది దానిపై 95 మీటర్ల ఎత్తైన భవనాన్ని నిర్మించడానికి వీలుగా రూపొందించబడింది.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group