యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను (Studentsaftey) మరింత బలపరచేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, అలాగే పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ పరిధిలో విద్యార్థులు పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కొత్త నిబంధనలలో ముఖ్యమైనది విద్యార్థుల కదలికలపై నియంత్రణ. ఇకపై పాఠశాల ప్రాంగణం నుంచి విద్యార్థులు బయటకు వెళ్లే ప్రతి సందర్భాన్ని స్కూల్ యాజమాన్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు అనవసరంగా లేదా అనుమతి లేకుండా స్కూల్ నుంచి వెళ్లిపోకుండా కఠిన చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ క్రమంలోనే ఎగ్జిట్ పర్మిట్ (Exit permit) విధానంను తప్పనిసరి చేశారు. స్కూల్ సమయాల్లో విద్యార్థి బయటకు వెళ్లాలంటే అధికారిక అనుమతి ఉండాలి. ఈ అనుమతిని తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ముందుగానే ఇవ్వాలి. రాతపూర్వకంగా లేదా డిజిటల్ విధానంలో ఇచ్చిన అనుమతినే స్కూల్ అధికారులు చెల్లుబాటు అయ్యేదిగా పరిగణిస్తారు.
ఎటువంటి ఎగ్జిట్ పర్మిట్ లేకుండా విద్యార్థిని లేదా విద్యార్థిని స్కూల్ గేట్ల నుంచి బయటకు అనుమతించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నియమం చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా, ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. దీని ద్వారా అపహరణలు, ప్రమాదాలు, అనవసర గైర్హాజరీ వంటి సమస్యలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త నిబంధనలు విద్యార్థుల భద్రతను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని UAE ప్రభుత్వం చెబుతోంది. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, అధికారులు కలిసి బాధ్యతగా వ్యవహరిస్తే పిల్లలకు సురక్షితమైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.