గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా పుల్లపుల్లగా వేడివేడి అన్నంలో గోంగూర చికెన్ తింటే ఉంటుంది ఆ కాంబినేషన్ నచ్చని వారు ఎవరు ఉండరేమో బహుశా. గోంగూర చికెన్ అన్నంతోనైనా, చపాతీతోనైనా, బిర్యానీ కాంబినేషన్‌లోనైనా భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా గ్రేవీగా వచ్చే విధంగా కొలతలతో చూపిస్తున్నాను, సో డెఫినెట్‌గా ట్రై చేయండి.
లేట్ చేయకుండా మరి రెసిపీలోకి వెళ్లిపోదాం ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఒట్టి ఆకుల్ని మాత్రమే వేసుకోండి, కాడలు వేయొద్దు. 100 గ్రాములు అంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు చిన్న సైజు కట్టలు తీసుకోవచ్చండి. సో ఆకులు వేసేసిన తర్వాత మగ్గించుకోవాలన్నమాట. మెత్తగా అయిపోయేంత వరకు మూత పెట్టుకొని కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మాష్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టేసుకోండి.
ఇప్పుడు అదే పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, నాలుగు లవంగ మొగ్గలు, రెండు యాలక్కాయలు వేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఒక టీస్పూన్ దాకా జీలకర్ర, సన్నగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు బాగా వేగాలి అర టేబుల్ స్పూన్ దాకా అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టీస్పూన్ దాకా ఉప్పు వేసి అంతా కూడా మిక్స్ చేసి, టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్‌ని ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే చికెన్ వాసన రాకుండా ఉంటుందన్నమాట.
అలాగే గోంగూరలో చికెన్ పీసెస్ మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజులో కొట్టించుకొని పెట్టుకోండి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని, మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గిస్తే చికెన్ పీసెస్ కుక్ అవుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీస్పూన్ల దాకా కారం వేయండి. కారం వేసిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని, మూత పెట్టి కంప్లీట్‌గా చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మగ్గించుకొని మాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని వేసేసి, చికెన్‌కు గోంగూర అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి.
ఫైనల్ గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుని జస్ట్ 5 ఐదు నిమిషాల నుండి పది నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ లో ఒకసారి ఇలా గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది