మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన అనుభవం. అయితే, గర్భధారణ సమయంలో శరీరంలో కలిగే విపరీతమైన మార్పులు, హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలామంది మహిళలు తీవ్రమైన ఒత్తిడి ఆందోళన మరియు మూడ్ స్వింగ్స్కు గురవుతుంటారు. ఈ ఒత్తిడి కేవలం తల్లి ఆరోగ్యంపైనే కాకుండా, కడుపులో పెరిగే బిడ్డపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ సమస్యను అధిగమించడానికి సరైన ఆహార నియమాలు పాటించడం ఒక్కటే ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్-సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం జలుబు, దగ్గును తగ్గించడమే కాకుండా, మానసిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది. గర్భిణులు విటమిన్-సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వారిలో 'కార్టిసాల్' అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఉసిరి, నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ మరియు బ్రోకలీ వంటివి తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
గర్భవతులు దృఢంగా ఉండటానికి ప్రోటీన్ అవసరం. పాలు మరియు పాల పదార్థాలు తీసుకోవడం వల్ల కేవలం బలం మాత్రమే కాదు, మానసిక ఉపశమనం కూడా లభిస్తుంది. పాలలో ఉండే 'లాక్టియమ్' అనే ప్రోటీన్ ఒత్తిడితో పోరాడే శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది రక్తపోటును అదుపులో ఉంచి, రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. సోయా పాలు తాగడం వల్ల క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు లభించి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడతాయి.
చేపలు మరియు ఇతర సీఫుడ్స్ ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇవి తల్లిలో కలిగే మానసిక ఆందోళనలను తగ్గించడమే కాకుండా, పుట్టబోయే బిడ్డ మెదడు వికాసానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఏ రకమైన చేపలు తినాలో సందేహం ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
చిరుధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ రైస్ మరియు గోధుమ రొట్టెలు తీసుకోవడం వల్ల మెదడులో 'ఎండార్ఫిన్లు' విడుదలవుతాయి. ఇవి మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే వీటివల్ల విడుదలయ్యే 'సెరటోనిన్' అనే హార్మోన్ ఒత్తిడిని మాయం చేసి, గర్భిణులు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
ఆకుకూరలు మరియు పండ్లు తాజా ఆకుకూరలు, పచ్చి కూరగాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. వారానికి కనీసం రెండుసార్లు ఆకుకూరలు తినే గర్భిణుల్లో నిరాశ, నిస్పృహలు తక్కువగా ఉంటాయని పరిశోధనలుఏదైనా ఆహార మార్పులు చేసుకునే ముందు గర్భిణులు తమ గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం వెల్లడిస్తున్నాయి. ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.