SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. డబ్బులు పెట్టి స్టోరేజ్ కొనక్కర్లేదు.. ఈ ట్రిక్ పాటిస్తే మీ స్పేస్ మళ్ళీ వెనక్కి వస్తుంది.. ఒక్క ఛార్జర్.. మూడు పనులు! ఇకపై మీ బెడ్ పక్కన వైర్ల గందరగోళం ఉండదు.. ఇవే లేటెస్ట్ ట్రెండ్! AI Security: చాట్‌జీపీటీలో ప్రభుత్వ కీలక పత్రాలు… ట్రంప్ ప్రభుత్వ భారత సంతతి సైబర్ చీఫ్‌పై సంచలన నివేదిక..!! WhatsApp update: వాట్సాప్‌లో హై సెక్యూరిటీ ఫీచర్.. తెలియని నంబర్లకు నో ఎంట్రీ! మొబైల్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కోక తప్పదు! Jio Free AI Course: విద్యార్థులు, టీచర్లకు జియో ఫ్రీ AI కోర్స్.. 4 వారాల్లో! Aadhaar Update: ఆధార్ యూజర్లకు బిగ్ అప్‌డేట్..! జిరాక్స్‌లకు శాశ్వత గుడ్‌బై! Tech News Telugu: వాట్సాప్ వాడాలంటే ఇకపై డబ్బులు కట్టాలా? మెటా సంచలన నిర్ణయం..!! మీ ఇంట్లో పాత టీవీని కంప్యూటర్ లా మార్చుకోండి! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. డబ్బులు పెట్టి స్టోరేజ్ కొనక్కర్లేదు.. ఈ ట్రిక్ పాటిస్తే మీ స్పేస్ మళ్ళీ వెనక్కి వస్తుంది.. ఒక్క ఛార్జర్.. మూడు పనులు! ఇకపై మీ బెడ్ పక్కన వైర్ల గందరగోళం ఉండదు.. ఇవే లేటెస్ట్ ట్రెండ్! AI Security: చాట్‌జీపీటీలో ప్రభుత్వ కీలక పత్రాలు… ట్రంప్ ప్రభుత్వ భారత సంతతి సైబర్ చీఫ్‌పై సంచలన నివేదిక..!! WhatsApp update: వాట్సాప్‌లో హై సెక్యూరిటీ ఫీచర్.. తెలియని నంబర్లకు నో ఎంట్రీ! మొబైల్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కోక తప్పదు! Jio Free AI Course: విద్యార్థులు, టీచర్లకు జియో ఫ్రీ AI కోర్స్.. 4 వారాల్లో! Aadhaar Update: ఆధార్ యూజర్లకు బిగ్ అప్‌డేట్..! జిరాక్స్‌లకు శాశ్వత గుడ్‌బై! Tech News Telugu: వాట్సాప్ వాడాలంటే ఇకపై డబ్బులు కట్టాలా? మెటా సంచలన నిర్ణయం..!! మీ ఇంట్లో పాత టీవీని కంప్యూటర్ లా మార్చుకోండి!

జిమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. డబ్బులు పెట్టి స్టోరేజ్ కొనక్కర్లేదు.. ఈ ట్రిక్ పాటిస్తే మీ స్పేస్ మళ్ళీ వెనక్కి వస్తుంది..

గూగుల్ ఇచ్చే 15 GB డేటా సరిపోవడంలేదా? – ఏ ఒక్క మెయిల్ లేదా ఫోటో డిలీట్ చేయనక్కర్లేదు – 'స్టోరేజ్ సేవర్' ఆప్షన్‌తో 40% వరకు స్పేస్ ఫ్రీ – మీ ఫోన్‌లోనే సులభంగా చేసుకునే స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్.

Published : 2026-01-30 12:11:00
  • స్మార్ట్ ట్రిక్: ఒక్క క్లిక్‌తో మీ జిమెయిల్ స్టోరేజ్‌ను క్లీన్ చేయండి..
  • స్టోరేజ్ సేవర్ ఆప్షన్‌తో జిమెయిల్ స్టోరేజ్‌ను రీకవర్ చేసుకోండి.. ఫుల్ డీటెయిల్స్!

ఈ రోజుల్లో మనందరికీ స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిపోయింది. దానితో పాటు మనకు వచ్చే ఈమెయిల్స్, మనం తీసుకునే ఫోటోలు మన జిమెయిల్ స్టోరేజ్ ని చాలా త్వరగా నింపేస్తుంటాయి. గూగుల్ ఇచ్చే 15 GB డేటా ఎప్పుడు అయిపోతుందో కూడా మనకు తెలియదు. స్టోరేజ్ ఫుల్ అని మెసేజ్ రాగానే మనం కంగారు పడిపోయి ముఖ్యమైన మెయిల్స్ లేదా ఫోటోలను డిలీట్ చేయడం మొదలు పెడతాము. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్, మెయిల్స్ లేదా ఫోటోలను డిలీట్ చేయకుండానే, మీ జిమెయిల్ స్టోరేజ్‌ను సుమారు 20% నుండి 40% వరకు ఫ్రీ చేసే ఒక అద్భుతమైన ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జిమెయిల్ స్టోరేజ్ సమస్యను గుర్తించడం ఎలా?
మొదట మీ ఫోన్‌లో Gmail App ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న మీ ప్రొఫైల్ సింబల్‌పై క్లిక్ చేస్తే, అక్కడ మీ స్టోరేజ్ ఎంత శాతం నిండిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, మీకు "86% of 15 GB used" అని చూపిస్తే, కేవలం 14% మాత్రమే ఖాళీగా ఉందని అర్థం. ఇలాంటప్పుడు మనం త్వరగా స్పేస్‌ను మేనేజ్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్
ఈ ట్రిక్ ఉపయోగించడానికి మీరు కింది దశలను అనుసరించాలి:
1. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్: ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేశాక, "Manage your Google Account" అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
2. డేటా అండ్ ప్రైవసీ: లోపలికి వెళ్ళిన తర్వాత "Data & Privacy" అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.

3. యాప్స్ అండ్ సర్వీసెస్: కిందకు స్క్రోల్ చేస్తే "Apps and services" లో Gmail ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని గూగుల్ డాష్‌బోర్డ్‌కు తీసుకెళ్తుంది.
4. గూగుల్ ఫోటోస్ ఎంపిక: డాష్‌బోర్డ్‌లో మీకు గూగుల్ ఫోటోస్ కనిపిస్తాయి. అక్కడ ఫోటోల సంఖ్య కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

5. డెస్క్‌టాప్ సైట్ ఎనేబుల్: ఒకవేళ ఆప్షన్స్ సరిగ్గా కనిపించకపోతే, బ్రౌజర్‌లో మూడు చుక్కల మీద క్లిక్ చేసి "Desktop site" ను ఎనేబుల్ చేసుకోండి.
6. క్లౌడ్ ఆప్షన్: స్క్రీన్ ఎడమ వైపు కింద భాగంలో ఒక క్లౌడ్ (Cloud) సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

7. స్టోరేజ్ సేవర్ (Storage Saver): ఇక్కడ "Recover storage" లో "Convert existing photos and videos to Storage Saver" అనే ఆప్షన్ ఉంటుంది. దీని పక్కన ఉన్న "Learn more" పై క్లిక్ చేయాలి.
8. కంప్రెషన్ ప్రారంభం: అక్కడ ఉన్న చెక్ బాక్స్ టిక్ చేసి "Compress existing photos and videos" పై క్లిక్ చేయండి.

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా గూగుల్ ఫోటోస్‌లో మనం సేవ్ చేసే ఫోటోలు హై రిజల్యూషన్ లో ఉంటాయి. ఒక్కో ఫోటో 3 MB నుండి 4 MB వరకు ఉండవచ్చు. ఈ ప్రాసెస్ చేయడం ద్వారా ఆ ఫోటోల క్వాలిటీ తగ్గకుండానే వాటి సైజు కంప్రెస్ అవుతుంది. అంటే 3-4 MB ఉండే ఫోటో 1 MB కి మారుతుంది. దీనివల్ల మీ స్టోరేజ్ ఆటోమేటిక్‌గా ఖాళీ అవుతుంది.

ఈ ప్రాసెస్ పూర్తి అవ్వడానికి కొన్ని గంటల సమయం పట్టవచ్చు అని గూగుల్ చెబుతుంది, కానీ సాధారణంగా 10 నుండి 15 నిమిషాల తర్వాత మీరు చూస్తే మీ స్టోరేజ్ గణనీయంగా పెరగడం గమనించవచ్చు. మీ ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఏవీ డిలీట్ అవ్వవు, కేవలం వాటి సైజు మాత్రమే తగ్గుతుంది. ఈ చిట్కా మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి! మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా "ఆంధ్రప్రవాసి" వెబ్ సైట్ మరియు సోషల్ మీడియా ఛానల్స్ (WhatsApp) ఫాలో అవ్వండి.

Spotlight

Read More →