Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు!

Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే!

వంకాయ ఎండు రొయ్యల కూరను పక్కా పల్లెటూరి రుచితో ఎలా వండాలో.. ఎండు రొయ్యల నీచు వాసన రాకుండా ఉండే రహస్య చిట్కా మరియు బ్యాచిలర్స్ కోసం సులభమైన వంట విధానం

Published : 2026-01-30 17:25:00

మాంసాహార ప్రియులు వారమంతా నాన్-వెజ్ వండినా లొట్టలు వేసుకుంటూ తింటారు. అయితే ప్రతిరోజూ చికెన్, చేపలు లేదా పచ్చి రొయ్యలు తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వంకాయ కూరలో కాస్త ఎండు రొయ్యలు వేసి వండితే.. ఆ వాసనకే ఆకలి రెట్టింపవుతుంది. వంకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ అంటేనే 'వేరే లెవెల్'. పర్ఫెక్ట్‌గా అన్ని దినుసులు వేసి వండితే, ఆ అమోఘమైన రుచి ముందు చికెన్, మటన్ బిర్యానీలు కూడా సరిపోవండోయ్! మరింకెందుకు ఆలస్యం? బ్యాచిలర్ బాయ్స్, మ్యారీడ్ గర్ల్స్.. గెట్ రెడీ! ఈ వంకాయ-ఎండు రొయ్యల కూరను కుమ్మేద్దాం రండి.

కావలసిన పదార్థాలు:

 వంకాయలు: అర కిలో (తాజావి)

 ఎండు రొయ్యలు: 100 గ్రాములు (మీకు ఇష్టమైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు)

ఉల్లిపాయలు: రెండు

 పచ్చిమిర్చి: నాలుగు

టమాటాలు: రెండు (మధ్యస్థ పరిమాణం)

పసుపు: ఒక స్పూన్

 ఉప్పు: తగినంత

 కారం: రెండు స్పూన్లు

ముఖ్యమైన చిట్కా: ఎండు రొయ్యలు పచ్చి రొయ్యల్లా మెత్తగా, టేస్టీగా రావాలంటే.. ఒక చిన్న ట్రిక్ పాటించండి. రొయ్యలను శుభ్రం చేసి, కాస్త పసుపు వేసి ప్రెజర్ కుక్కర్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా చేయడం వల్ల ఎండు రొయ్యల నీచు వాసన పోవడమే కాకుండా, అవి పచ్చి రొయ్యల్లా తయారవుతాయి. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

ముందుగా స్టవ్ వెలిగించి, మీడియం మంటపై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నె వేడెక్కాక నూనె వేసి, అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయండి. వెంటనే పసుపు, కారం, ఉప్పు వేసి మీడియం మంటపై మగ్గనివ్వండి. కూర నుండి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉంచండి.

వంకాయ ముక్కలు మగ్గినట్లు అనిపించినప్పుడు, ఒక గ్లాసు నీరు పోయండి. కూరను ఒకసారి బాగా కలిపి, ఉప్పు-కారం సరి చూసుకోండి. కూర పై నూనె పైకి తేలేంతవరకు ఉంచి దించేయండి. అంతే గుమగుమలాడే వంకాయ - ఎండు రొయ్యల కర్రీ రెడీ వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే.. ఎంతటి వారైనా మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మీరు వండి మీ ఆత్మీయులకు వడ్డించండి..

Spotlight

Read More →