ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 45వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి
45. ఓం సర్వమంగళ ప్రదాయై నమః
అర్థం: శ్రీమద్భగవద్గీత ప్రకారం నడుస్తున్నప్పుడు ప్రతి విషయం సానుకూలంగా మారుతుంది. ఆటంకాలు తొలగి, జీవితం సుఖంగా, శాంతిగా సాగిపోతుంది.
జీవితం మంగళకరంగా సాగాలని అందరం కోరుకుంటాము. కీడు కలిగించేవాటినన్నిటిని అమంగళకరంగా భావిస్తాము. ‘అమంగళం శాంతించు గాక’ అని పెద్దలు అంటూ ఉంటారు. మనం అనుకొన్నంతనే అమంగళం శాంతించి, శుభాలు కలుగుతాయా? సత్కర్మలు ఆచరించటం, సమస్త కర్మలపట్ల కర్తృత్వం, భోక్తృత్వం వదిలి పెట్టటం, కర్మల ఫలితాన్ని భగవదర్పణ చేయటం, ప్రాణుల పట్ల దయతో ప్రవర్తించటం, ‘లోకా స్సమస్తా స్సుఖినో భవంతు’ అని కోరుకోవటం - ఇటువంటి జీవన పద్ధతులన్నీ భగవద్గీత బోధిస్తుంది. ఆ విధంగా నడుచుకుంటున్నప్పుడు పరమాత్మే నా యోగ క్షేమాలను చూసుకుంటారు. ఆత్మార్పణ బుద్ధితో ఉన్నప్పుడు సమస్త శుభాలు కలుగుతాయి.
ఈ విధంగా నా జీవితం మంగళకరంగా సాగటానికి దారి చూపుతున్న గీతామాతకు భక్తిపూర్వకంగా నమస్కృతి సమర్పిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!
నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!