LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Andhra Pradesh

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala 23
Tirumala 23

సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం..

తిరుమలలో భారీగా భక్తుల రాక.. నిన్న 86,124 మంది భక్తుల దర్శనం..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోందని సమాచారం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ ఉన్నప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత రోజు మొత్తం 86,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కుల్లో భాగంగా 41,520 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల కోసం విక్రయించిన లడ్డూల సంఖ్య 3.97 లక్షలకు చేరుకుంది.

అన్నప్రసాద సేవ ద్వారా 2.76 లక్షల మంది భక్తులు భోజన సదుపాయం పొందారు. అలాగే తిరుమలలో ఏర్పాటు చేసిన వైద్య సేవలను 3,972 మంది భక్తులు వినియోగించుకున్నారు. భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో టీటీడీ సూచనలు పాటిస్తూ, ఓపికతో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Be the first to react

More Coverage