భారతీ సిమెంట్స్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్ డీ లపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీ సిమెంట్స్ కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్ డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
భారతీ సిమెంట్స్ ఎఫ్ డీ ల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకొని ఎఫ్ డీ లను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పున సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈడీ . పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టుకు.. సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాక కూడా ఎఫ్ డీ లను జప్తు చేశారని భారతీ సిమెంట్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గా కోర్టు దృష్టికి తెచ్చారు. కనీసం ఎఫ్ డీ లపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.
ఎఫ్ డీలు విడుదల చేయాలన్న హైకోర్టు తీర్పునే పునఃపరిశీలించాలని సూచించినప్పుడు.. జప్తు చేసిన దానికి వడ్డీ ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగించినట్లు వెల్లడించింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి