⚡ BREAKING

President: ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం!

President: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఒడిశా పర్యటనకు బయలుదేరారు. తన స్వస్థలమైన మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగ్‌పూర్‌కు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

President Murmu
President Murmu

రాయ్రంగ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం..

మయూర్భంజ్లో రాష్ట్రపతి పర్యటన.. గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం..

భువనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఒడిశా పర్యటనకు బయలుదేరారు. తన స్వస్థలమైన మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్కు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, గిరిజన సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాయ్రంగ్పూర్లో ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని ఆమె సందర్శించనున్నారు.

అలాగే కుసుమి బ్లాక్లోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 113 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే భారీ సమగ్ర గ్రామీణ పైపులైన్ నీటి సరఫరా ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.

పర్యటనలో భాగంగా బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్మించిన మాతృశక్తి భవన్, కొత్తగా నిర్మించిన ప్రత్యేక సర్క్యూట్ హౌస్, నూతనంగా ఏర్పాటు చేసిన రాయ్రంగ్పూర్ పోలీస్ జిల్లాను కూడా రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మయూర్భంజ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఒడిశా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాయ్రంగ్పూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ కార్యక్రమాలు దోహదపడనున్నాయి.

Be the first to react

Latest