⚡ BREAKING

Tamil Nadu: ‘వెట్రి తమిళగం’ విజన్ డాక్యుమెంట్‌కు ఆమోదం.. నవజాత శిశువులకు బంగారు ఉంగరం పథకం!

Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం ‘వెట్రి తమిళగం’ విజన్ డాక్యుమెంట్‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా పలు కొత్త కార్యక్రమాలను అమలు చేయనున్నారు.

Tamil Nadu Government
Tamil Nadu Government

నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం.. తమిళనాడు కొత్త పథకం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే చిన్నారులకు బంగారు కానుక పథకం..

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ‘వెట్రి తమిళగం’ విజన్ డాక్యుమెంట్కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా పలు కొత్త కార్యక్రమాలను అమలు చేయనున్నారు.

ఈ విజన్ డాక్యుమెంట్లో ముఖ్యమైన పథకంగా ‘తాయిమామన్ తంగా మోతిర తిట్టం’ (మేనమామ బంగారు ఉంగరం పథకం)ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా తమిళనాడులో శాశ్వతంగా నివసించే కుటుంబాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించనున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు, తల్లి మరియు నవజాత శిశువు ఆరోగ్యానికి గౌరవ సూచకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పుట్టిన బిడ్డతో పాటు తల్లిని కూడా ప్రత్యేకంగా గుర్తించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.755.83 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పథకాన్ని త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

‘వెట్రి తమిళగం’ విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్ధి, మెరుగైన ప్రభుత్వ సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కొత్తగా జన్మించే చిన్నారులకు అందించే ఈ బంగారు ఉంగరం పథకం ప్రజల్లో సానుకూల స్పందన పొందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags

Be the first to react

Latest