Ayodhya: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై సిట్ దర్యాప్తు ప్రారంభం!

Ayodhya: శ్రీ రామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది.

Ayodhya
Ayodhya

రామ మందిర కానుకల నిర్వహణపై విచారణ.. అయోధ్య చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం..

భక్తుల విరాళాలపై వచ్చిన ఆరోపణలపై రంగంలోకి సిట్ అధికారులు..

అయోధ్య: శ్రీ రామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్కు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వం వహిస్తున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. సిట్ సభ్యులు అయోధ్య చేరుకుని దర్యాప్తు ప్రక్రియను మొదలుపెట్టారు.

విచారణలో భాగంగా సిట్ అధికారులు అయోధ్య రామ మందిర ప్రాంగణాన్ని సందర్శించారు. అయోధ్య కమిషనర్, జిల్లా కలెక్టర్తో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విరాళాలు, కానుకల నిర్వహణకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి తుది నిర్ధారణలు వెల్లడించలేదు. ప్రస్తుతం విచారణ ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు.

సిట్కు ఏడు రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని అంశాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగనుంది.

ఇదిలా ఉండగా, రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా అయోధ్యలో ఉన్నారు. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సిట్ కోరిన ప్రతి సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు అందిస్తారని తెలిపారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి వివరాలను బయటపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Be the first to react

Latest