Orissa: ఒడిశాలో రూ.47,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమాలు!
Orissa: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి 68వ జన్మదినం సందర్భంగా మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఒడిశాలో అభివృద్ధి పండుగ.. రూ.47,600 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ, ముర్ము..
ఒడిశా నుంచి అభివృద్ధికి కొత్త బాట.. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఊతం..
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి 68వ జన్మదినం సందర్భంగా మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రపతి, ప్రధాని కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాల్ జహేరా, హో జహేరా పవిత్ర స్థలాలను సందర్శించి ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం అక్కడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పాఠశాలను సందర్శించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ పర్యటన ద్వారా ప్రోత్సహించనున్నారు.
రైరంగ్పూర్లో ఒడిశా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రూ.47,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అప్పర్ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఐబీ థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణ, ఝార్సుగూడలో భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని భారీ ప్రజాసభలో ప్రసంగించనున్నారు. ఒడిశా అభివృద్ధిలో కొత్త దశకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అధికారులు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగే పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 23వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.18,880 కోట్లకు పైగా నిధులు నేరుగా జమ కానున్నాయి.
అలాగే పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి పంటల బీమా పథకం, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రి స్టాక్, నేచురల్ ఫార్మింగ్ జాతీయ మిషన్, ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన వంటి వ్యవసాయ పథకాలను ప్రారంభించనున్నారు.
తరువాతి రోజు కోల్కతాలో జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఉదయం జరిగే ఈ కార్యక్రమం అనంతరం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మూడు నౌకలు — ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
Be the first to react