TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం!

TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ధరల వ్యత్యాసంతో నష్టం నివారించేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 2026-01-31 10:49:00


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులకు విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు అతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే టీటీడీ వద్ద డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో, భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచే విక్రయ కౌంటర్లను మూసివేశారు.

గత కొంతకాలంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి బంగారం, వెండి డాలర్ల ధరలను వారానికి ఒకసారి మాత్రమే, ప్రతి మంగళవారం సవరిస్తారు. కానీ, మార్కెట్‌లో రోజువారీగా ధరలు మారుతుండటంతో టీటీడీ నిర్ణయించిన ధరలకు మరియు మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు కనిపించడంతో పాటు, విక్రయాల్లో అసమతుల్యత ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు ముఖ్యంగా 5 గ్రాములు, 10 గ్రాముల బంగారు డాలర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడం ప్రారంభించారు. సాధారణంగా దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు వ్యాపార దృష్టితో కూడా కొందరు కొనుగోళ్లకు ముందుకు రావడం వల్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో పరిమిత సమయంలోనే భారీ మొత్తంలో డాలర్లు విక్రయమవడంతో టీటీడీ వెంటనే పరిస్థితిని సమీక్షించి అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ నష్టాలను నివారించడంతో పాటు విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించే యోచనలో ఉంది. అలాగే శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక్కొక్కరికి ఒక డాలర్ చొప్పున అమ్మాలని భావిస్తోంది. రూ.50 వేలకుపైగా కొనుగోలు చేసే భక్తులు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

Spotlight

Read More →