ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన యువ యూట్యూబర్ మధుమతి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ. కొండూరు గ్రామానికి చెందిన మధుమతి, చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆన్ లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి, అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?
ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వివాహితుడైన ప్రతాప్ తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ప్రతాప్ వేధింపులు తాళలేకనే మధుమతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే మధుమతి మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!
ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!
అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: