ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు ఈ నెల 24న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాలోని ఓ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో గోపితో పాటు రజని కూడా నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో గోపి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు గోపిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అధికారులు కోరగా... రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం గోపిని జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: