Header Banner

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

  Fri May 02, 2025 13:45        Politics

రాజధాని అమరావతికి ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వారధి ద్వారా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా, అతి తక్కువ సమయంలో నేరుగా అమరావతికి చేరుకోవచ్చు. ప్రధానమంత్రి పర్యటన, అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం నేపథ్యంలో ఈ వంతెనను అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జి, అమరావతికి అత్యంత వేగవంతమైన అనుసంధానతను అందిస్తుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు గొల్లపూడి వద్ద ఈ వంతెన ఎక్కితే కేవలం ఐదు నిమిషాల్లోనే కృష్ణా నదిని దాటి అమరావతిలోని వెంకటపాలెం చేరుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి: అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

అదేవిధంగా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కి, విజయవాడ ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా అరగంటలోపే అమరావతిలోకి ప్రవేశించే వీలు కలిగింది. ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవ్వడంతో పాటు, అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు, నిర్మాణ సామగ్రి రవాణా కూడా సులభతరం కానుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఇరువైపులా వేర్వేరు మార్గాలు, సూచికలు, డివైడర్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్గం అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations