సాగరతీర నగరం వైజాగ్‌లో మెట్రో చాలా మంది కల. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభజించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు.
నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు (Metro Rail Project) నాలుగేళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) అధికంగా ఉన్నందున పరిష్కారం లభించేలా మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలన్నారు. (ఈనెల 11న విజయవాడలో జరిగిన సమావేశం) ఈ నేపథ్యంలో మొత్తం 11,498 కోట్లకు పైగా అంచనా వ్యయంతో విశాఖపట్నం మెట్రో పనులు వేగం పుంచుకున్నాయి. 3వ దశలో 3వ దశ కారిడార్లు 46.23 కిలో మీటర్ల దూరం, 42 స్టేషన్లు ఉండనున్నాయి. విశాఖలో భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు. జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం రూ. 224 కోట్లతో ఆహ్వానించారు. బిడ్‌లు 09.06.2025న తెరుచుకుంటాయి.
ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్ జంప్! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు!
పర్యావరణ అనుకూలంగా..
విశాఖపట్నం మెట్రోను పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కార్బన్ ఉద్గారాలను దాదాపు జీరో లెవల్‌కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైన విద్యుతును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. ప్రయాణాన్ని మరింత హాయిగా మార్చేందుకు ట్రాక్ వెంట పచ్చదనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్లు, డిపోలు, సర్వీస్ భవనాలు, వయాడక్టులు, పార్కింగ్ షెల్టర్లపై సోలార్ పివి ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, పగటి సమయంలో సహజ విద్యుత్‌ను ఉపయోగించనున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైన విద్యుతును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా విశాఖపట్నం మెట్రో, స్మార్ట్ టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణను టార్గెట్‌గా పెట్టుకుంది.
కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను త్వరిత గతిన పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకువస్తున్నారు.
మూడు కారిడార్లతో మొదటి దశ..
మొదటి దశ: మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లు.
రెండో దశ: కొమ్మడి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 8 కిలోమీటర్ల నాల్గవ కారిడార్.
మొత్తం ఖర్చు: రూ. 11,498 కోట్లకు పైగా అంచనా, కేంద్రం నుంచి 100 శాతం గ్రాంట్ కోసం ఆశిస్తున్నారు.
ఈ క్రమంలోనే మొదటి దశ కోసం జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం రూ. 224 కోట్లతో ఆహ్వానించారు.
కారిడార్ వారీగా వైజాగ్ మెట్రో మార్గాలు...
కారిడార్ I: స్టీల్ ప్లాంట్ – కొమ్మడి జంక్షన్ (34.4 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: గాజువాక, NAD జంక్షన్, ఎయిర్‌పోర్ట్, MVP కాలనీ, యేందాడ, మధురవాడ
కారిడార్ II: గురుద్వారా – పాత పోస్టాఫీస్ (5.07 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: డ్వారకానగర్, RTC కాంప్లెక్స్, దబా గార్డెన్స్, పూర్ణ మార్కెట్
కారిడార్ III: తాటిచెట్లపాలెం – చినవాల్తేరు (6.75 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: RTC కాంప్లెక్స్, సిరిపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఆర్కే బీచ్
కారిడార్ IV (రెండో దశ): కొమ్మడి – భోగాపురం ఎయిర్‌పోర్ట్ (8 కిలో మీటర్లు)
ప్రధాన స్టేషన్లు: మారికావలస, గంభీరాం, తగరపువలస, భోగాపురం
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్..
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: