Header Banner

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

  Wed Apr 30, 2025 15:20        Politics

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించారు. ఇంకా ఇతర విషయాల గురించి ప్రస్తావించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రెడ్డి గణపవరం సమీపంలోని పల్లపూరు, రౌతు గూడెంలోని నిర్వాసితుల కాలనీలను మంత్రి సందర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తామన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అర్హులకు, కొత్తగా వివాహమైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఈ నెలాఖరుకు ఈకేవైసి ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో ఐదు సంవత్సరాలు దాటి పాడైన ఇళ్లకు మరమ్మతులు చేపట్టేందుకు సర్వే చేసి వివరాలు ప్రతిపాదిస్తే మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇది కూడా చదవండి: డయాబెటిక్ పేషెంట్స్‌కి బెస్ట్ డైట్! ఇన్‌సులిన్‌కి సహాయపడే ఆహారాలు ఇవే..!

 

అధైర్య పడకండి అండగా ఉంటాం అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. మండలంలోని కట్కూరు, ఎర్రవరం పునరావాస కాలనీల్లో కూడా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో రైతాంగానికి, ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచి నీటి పథకం ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఐటిడిఎ పిఓను ఆదేశించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ, పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిర్వాసిత కాలనీల్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి ఉచితంగా 35 కేజీల బియ్యం ఇచ్చేందుకుగాను ఎఎవై కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ నాటికి మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో పోషకాహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం లబ్దిదారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు పంపిణీ చేశారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations