ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. వారు తీసుకున్న అప్పుల్లో 1 లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ రుణం 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య తీసుకున్నది అయివుండాలి. ఈ రుణమాఫీలో.. అప్పు, దాని వడ్డీ కలిపి లక్ష రూపాయల వరకూ మాఫీ అవుతుంది. అంతకు మించి అప్పు ఉన్నా, మాఫీ మాత్రం లక్ష వరకే అవుతుంది. ఇందులో మరో కండీషన్ ఉంది. అప్పు తీసుకునేవారు.. చేనేత వృత్తికి సంబంధించి మాత్రమే తీసుకొని ఉండాలి. లేదా.. చేనేత ఉత్పత్తుల కోసం తీసుకొని ఉండాలి. లేదా చేనేత యంత్రాలు, పరికరాలు కొనడానికి అప్పు తీసుకొని ఉండాలి. అలాంటి అప్పులకు మాత్రమే రుణమాఫీ చేస్తారు. ఇలా ఏపీలోని వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం శుభవార్తగా మారుతోంది.
ఇది కూడా చదవండి: అమరావతి పునఃప్రారంభ సభలో ప్రత్యేక ఆకర్షణగా స్క్రాప్ మోదీ విగ్రహం! ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు..
ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 33 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం మార్చిలోనే విడుదల చేసింది. కానీ ఈ డబ్బు ఇంకా లబ్దిదారుల అకౌంట్లలో జమ కాలేదు. ఇప్పుడు గైడ్‌లైన్స్ ఆధారంగా.. డబ్బు ఇస్తారు. ఇలా ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు కీలకం కాబోతున్నాయి. ఈ కమిటీలు.. అప్పు తీసుకున్న వారితో మాట్లాడతాయి. రుణమాఫీ పొందేందుకు అర్హులో కాదో తెలుసుకుంటాయి. మరోవైపు బ్యాంకుల నుంచి కూడా.. లబ్దిదారుల జాబితాను తీసుకుంటాయి. ఈ ప్రక్రియ తర్వాత ఒక వారంలో రుణమాఫీని ఆమోదిస్తాయి. అంటే.. ఇప్పటి నుంచి ఓ 10 రోజులు వేసుకోవచ్చు. ఆ తర్వాత రుణం మాఫీ అవ్వొచ్చు. మాఫీ అయ్యిన తర్వాత మళ్లీ కొత్తగా రుణాలు తీసుకునేందుకు వీలవుతుంది. ఇప్పుడు చేనేత కార్మికులు ఎలాగొలా ఈ రుణమాఫీ అమలయ్యేలా చేసుకోవాలి. ఏం చెయ్యాలంటే.. జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీ సభ్యులు ఎవరో తెలుసుకోవాలి. చేనేత కార్యాలయాలు, లేదా సచివాలయాలకు వెళ్లి.. దీనిపై వివరాలు అడగాలి. కమిటీ సమావేశం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలి. తద్వారా ఆ సమయానికి ఆ సమావేశానికి వెళ్లి.. రుణమాఫీ లబ్దిదారుల జాబితాలో మీరు పేరు ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ ఈ సమావేశం గురించి తెలియకపోతే, బ్యాంకుకి వెళ్లి.. రుణమాఫీ చెయ్యమని అడగాలి. ప్రభుత్వం ఆల్రెడీ మనీ రిలీజ్ చేసింది కాబట్టి.. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పమని అడగాలి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు వివరాలు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు. వారికి తగిన మార్కెటింగ్ సదుపాయాలు లేవు. కూటమి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది కానీ.. అవేవీ సరిపోవట్లేదు. తెలంగాణలో చేనేతలు.. బతుకమ్మ చీరలను తయారుచేయడం ద్వారా కొంత ఆదాయం పొందుతున్నారు. ఏపీలో కూడా ఇలాంటి పథకం ఉంటే.. చేనేతలకు మేలు జరుగుతుంది. చేతిలో పని దొరికి, కొంత ఆదాయం జనరేట్ అవుతుంది. అలా ఆదాయం వస్తూ ఉంటే, అప్పులు కూడా చెయ్యరు. వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: