హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)ని ఆరు లేన్లుగా విస్తరించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. కిలోమీటరుకు సుమారు రూ.20 కోట్ల చొప్పున 265 కిలోమీటర్లకు రూ.5,300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. జూన్ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా డీపీఆర్ రూపొందించే పనిని దక్కించుకున్న భోపాల్‌కు చెందిన సంస్థతో ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులు సమీక్షిస్తున్నారు. గతంలోనే ఆరు లేన్లకు సరిపడా భూమిని సేకరించారు. దాంతో ఇప్పుడు భూ సేకరణ చేయాల్సిన అవసరంలేదు.
ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు స్వల్ప గాయాలు..! పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్ ట్వీట్లు వైరల్!
అయితే విస్తరణకు సాంకేతికంగా కొన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయాలి. అందుకోసమే డీపీఆర్‌ను రూపొందించనున్నారు. హైదరాబాద్ అవతల దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. మార్గమధ్యలో కొన్నిచోట్ల వెహికల్ అండర్ పాస్‌లు (వీయూపీలు), రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌వోబీలు), బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర వీయూపీ నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ ఓపెన్ జంక్షన్ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రామాపురం దగ్గర్లో సిమెంటు ఫ్యాక్టరీలు ఉండడంతో లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందువల్ల వీయూపీ నిర్మించనున్నారు. ఆ జంక్షన్‌కు దగ్గర్లో పాలేరువాగు ప్రవహిస్తోంది. దానిపై ఉన్న బ్రిడ్జి ఇటీవల వర్షాలకు దెబ్బతినగా, మరమ్మతులు చేశారు. దానికి పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇవికాకుండా మిగతాచోట్ల ఎక్కడెక్కడ వీయూపీలు, ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు నిర్మించాలనే అంశంపై కూడా అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు 50 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: