Visa: భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్..! రికార్డు స్థాయి వీసా నిరాకరణలు..!

కూటమి అధికారంలోకి వచ్చాక తెదేపా, జనసేన, భాజపా కలిసి తొలిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. బుధవారం అనంతపురం వేదికగా సూపర్ సిక్స్-సూపర్హీట్ పేరుతో బహిరంగసభ ఏర్పాటు చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభ ఏర్పాటుచేశారు. 

Trump Post: ట్రంప్ కఠిన నిర్ణయంతో భారత్ ఉక్కిరిబిక్కిరి.. సుంకాలు పెంచిన అమెరికా..!

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, భాజపా అధ్యక్షుడు మాధవ్ సభకు హాజరుకానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు మూడు పార్టీల ప్రధాన నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు 3 లక్షలకు పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 

నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్ర వారి తక్షణ సహాయం కోసం నారా లోకేష్ రంగంలోకి! ఎమర్జెన్సీ ప్లాన్! సహాయం కొరకు సంప్రదించ వలసిన అత్యవసర నెంబర్లు!

ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3,857 బస్సులను సభ కోసం కేటాయించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనిత, సవిత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

Heart disease: నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు.. నిపుణుల సందేశం!

సభ కోసం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ను దారిమళ్లించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలను వడియంపేట వద్ద, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్ఎస్ గేటు వద్ద నుంచి మళ్లించారు. 

Turakapalem: తురకపాలెం ప్రజలకు మంత్రి భరోసా.. పుకార్లకు లోనవ్వొద్దు!

శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సభ ప్రాంగణంలోనే కమాండ్ కంట్రోల్ రూంను సిద్ధం చేశారు. సభ కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలను వినియోగించుకోవడంతో పాటు కొత్తగా మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. 

SSC CGL: అడ్మిట్‌ కార్డులు అవుట్‌..! 129 నగరాల్లో ఎస్సెస్సీ సీజీఎల్‌ టైర్‌–1 పరీక్షలు!

సభాప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్, ప్రముఖులు పర్యటించే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డైవర్షన్ పాయింట్స్, సభకు వచ్చి వెళ్లే మార్గాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు.

OPPO Smart Phone: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లు! కేవలం రూ.2 వేలకే 5G స్మార్ట్ ఫోన్! ఫుల్ డిటైల్స్..
RRR: రీజనల్ రింగ్ రోడ్ కీలక అప్డేట్! టెండర్లు గడువు మరోసారి పొడిగింపు!
Fee Schedule: ఇంటర్ ఫీజులపై బిగ్‌ అలర్ట్‌..! ఆ లోపు చెల్లించకపోతే జరిమానా తప్పదు..!
Nara Lokesh: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు! ఎందుకంటే!
Cyber Crime: ఆన్లైన్లో వెతికి మరీ ఫోన్ చేస్తున్నారా? .. మీ ఖాతా ఖాళీ!
Ap Govt: నూతన ఉపరాష్ట్రపతిగా ఆయన నియామకం! సీఎం చంద్రబాబు అభినందనలు - దేశ పురోగతికి కొత్త ఆశలు!