అమరావతి పునర్నిమాణ పనుల ప్రారంభోత్సవం కోసం మరికాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavaram Airport) చేరుకోనున్నారు. ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లింది. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. కలకత్తా వెళ్లడానికి ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారిలో ఒక ప్రయాణికుడు ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో మిగిలిన ప్రయాణికులు కంగారుపడ్డారు.
ఇది కూడా చదవండి: ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!
వీవీఐపీ రద్దీ ఉన్న ఎయిర్‌పోర్టులో అలజడి చెలరేగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రయాణికుడిని ప్రైవేటు క్యాబ్‌లో గన్నవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ ప్రయాణికుడికి ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తం ప్రభుత్వ అధికారుల నిఘాలో ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీస్‌ను నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేట్ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమాన టికెట్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేమార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: