LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  •  Health Tips: చిన్న లవంగంలో కొండంత ఆరోగ్యం.. రోజూ తింటే ఆ రోగాలు మాయం!  • 
National

Janasena: ఢిల్లీలో జనసేన సమావేశం.. దేశ సమగ్రతపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం!

Janasena: దేశ సమగ్రత, జాతీయ ఐక్యత లక్ష్యంగా జనసేన పార్టీ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Kasthuri S 1 min read
Janasena
Janasena

దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం.. పార్టీ కంటే జాతీయ సమైక్యత ముఖ్యమన్న పవన్..

‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’.. ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమం..

న్యూఢిల్లీ: దేశ సమగ్రత, జాతీయ ఐక్యత లక్ష్యంగా జనసేన పార్టీ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి దేశ సమగ్రత, దేశ శ్రేయస్సే ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక్కరోజులో జరిగే విషయం కాదని, ప్రతి తరం ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలని పవన్ అన్నారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం కోసం నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేసిన విధానంపైనే తమ అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. విభజన ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల కారణంగా అసంతృప్తి, సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.

రాష్ట్రాల విభజన అనంతరం ఆస్తుల పంపిణీ వంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విభజన వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర దృష్టి అవసరమన్నారు.

దేశ రాజకీయాల్లో ఢిల్లీకి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీపై పోరాడతామని మాట్లాడేవారు చాలామంది ఉన్నారని, కానీ ఢిల్లీకి వచ్చిన తర్వాత వారి గొంతు వినిపించకపోవడం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

జనసేన రాజకీయ ప్రయాణం దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉందని, జాతీయ భావన, సమైక్యత, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Be the first to react

More Coverage