⚡ BREAKING

Vijay: కురువై సీజన్ రైతులకు రూ.134 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ.. ప్రకటించిన తమిళనాడు సీఎం విజయ్!

Vijay: తమిళనాడులో కురువై సీజన్ పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యమంత్రి విజయ్ రైతులకు సహాయం అందించేందుకు రూ.134 కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు.

Vijay
Vijay

రుతుపవనాల ఆలస్యం, మెట్టూరు డ్యామ్ తెరవకపోవడంతో రైతులకు అండగా ప్రభుత్వం..

మెట్టూరు డ్యామ్ తెరవకపోవడంతో రైతులకు తమిళనాడు ప్రభుత్వం అండ..

చెన్నై: తమిళనాడులో కురువై సీజన్ పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యమంత్రి విజయ్ రైతులకు సహాయం అందించేందుకు రూ.134 కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు.

నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, ప్రతి సంవత్సరం జూన్ 12న తెరవాల్సిన మెట్టూరు డ్యామ్ను ఈసారి నిర్ణీత తేదీన తెరవలేని పరిస్థితి ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

కావేరి డెల్టా ప్రాంతం తమిళనాడు వ్యవసాయానికి ఎంతో కీలకమైనది. తంజావూరు, తిరువారూర్, నాగపట్టినం, మయిలాడుతురై జిల్లాలతో పాటు కడలూరు, తిరుచ్చి, అరియలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మొత్తం 52.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది.

ప్రస్తుతం మెట్టూరు డ్యామ్లో నీటి మట్టం కేవలం 79.56 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో జూన్ 12న డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. సాధారణంగా డెల్టా ప్రాంతాల్లో సాగయ్యే 5 లక్షల ఎకరాల వరి సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

అయితే కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ పాయింట్ల ద్వారా నీటి లభ్యత ఉండటంతో గరిష్ఠంగా 3.55 లక్షల ఎకరాల వరకు సాగు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర జిల్లాల్లో కూడా వర్షపాతం అసమానంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది.

రైతుల నష్టాలను తగ్గించి, కురువై పంట సాగుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి విజయ్ తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags

Be the first to react

Latest