ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 33వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

33. ఓం సద్గుణ ప్రదాయై నమః

అర్థం:  శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగంలో ప్రతి మనిషి అసుర గుణాలను తొలగించుకొని దైవసంపద పెంపొందించుకోవాలని పరమాత్మ చెప్పారు.  

ధర్మాచరణ పట్ల భయం లేకుండా ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలి. జ్ఞానయోగంతో ఉండాలి. దానగుణం ఉండాలి. అహింస, సత్యం, క్రోధ రాహిత్యం, త్యాగం కలిగి ఉండాలి. శాంతిగా, మృదువుగా ఉండాలి. చంచలత్వం లేకుండా వుండాలి. ఓర్పు, ధైర్యం మరియు శుచిత్వం కలిగి ఉండాలి. ద్రోహచింతన, స్వాతిశయం లేకుండా ఉండాలి.

ఇట్టి 26 సద్గుణాలలో ‘హ్రీ’ అనే సద్గుణం ఒకటి. హ్రీ అంటే సిగ్గుపడటం, బిడియపడటం. ఇది సద్గుణమేనా? సిగ్గుపడే వ్యక్తి ఈ మానవజన్మ ఇచ్చిన తండ్రి నా దేహంలోనే ఉండి ప్రతి ఆలోచన గమనిస్తున్నారని తెలిసి, సరియైన ఆలోచన కానప్పుడు సిగ్గుపడుతూ సరిచేసుకుంటూ ఉంటాడు. త్రివిధ తపస్సులు తనకు తెలియకుండానే ఆచరిస్తాడు. చిన్నపిల్లల మనస్సు స్వచ్ఛంగా ఉండటం చేత వారిలో అటువంటి బిడియం ఉంటుంది.

ముక్తావస్థలోని మాధుర్యాన్ని ఆస్వాదించటానికి అనువుగా ఇట్టి సద్గుణాలను ప్రసాదిస్తున్న గీతామాతకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!