ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 34వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
34. ఓం అభయ ప్రదాయై నమః
అర్థం: పుట్టినప్పటి నుండి పోయేదాక మనలను భయం వెన్నంటి ఉంటుంది. నీటిని చూసి, నిప్పును చూసి, క్రూర జంతువుల్ని చూసి భయపడతాము. ఇవి ఆధిభౌతిక భయాలు. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను చూసి భయపడతాము. ఇవి అధిదైవిక భయాలు.
చదువులో ఉత్తీర్ణులం అవుతామో లేదో? ఉద్యోగం వస్తుందో రాదో? పిల్లలు సరిగ్గా పెరుగుతారో లేదో? ఈ జబ్బుతో చనిపోతానేమో? ఇటువంటివి అన్నీ ఆధ్యాత్మిక భయాలు. వీటినుంచి బయటపడేదెలా?
మనస్సు అయితే గతంలోకి వెళ్లి బాధ పడుతుంది. లేకపోతే భవిష్యత్తులోకి వెళ్లి రేపు ఏం జరుగుతుందో, ఆ పని జరగకపోతే ఎలా అని భయపడుతుంది. అజ్ఞానం వలన భయం, భయం వలన దుఃఖం కలుగుతున్నాయి.
పదే పదే చేసిన ఆలోచన బలం పుంజుకొని, గట్టిపడి, భావోద్వేగంగా మారి, దేహం మీద ప్రభావం చూపుతుంది. ఎప్పుడైనా గభాలున భయపడితే దడ పుట్టినట్టు, మాట రాకపోవటం, చెమట పట్టటం, ఆలోచనలు ఆగిపోవటం జరుగుతుంది. ఈ దేహ క్రియా కలాపాలను, ఆలోచనలను గమనిస్తూ క్రమేణా ఈ భావోద్వేగాల నుండి విముక్తులమై సుఖసంతోషాలు పొందాలి.
ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నీ భయాలు, విషాదాలు, సందేహాలు అన్నీ వదలిపెట్టి నన్నే శరణు వేడమని (మామేకం శరణం వ్రజ) భగవంతుడు చెప్పారు. పరమాత్మను ఆశ్రయించిన అర్జునుడు అభయాన్ని పొందాడు. అన్ని భయాలలోకి మరణ భయం బలీయమైనది. మరణం అంటే దేహంతో వియోగం. అయితే జీవుడు వాస్తవంగా దేహం కాదు, దేహి. శాశ్వత సచ్చిదానంద ఘన స్వరూపం. ఈ విధంగా జీవుడికి అభయం ఇస్తుంది శ్రీమద్భగవద్గీత. దేహి ఎప్పుడైతే అనిర్వచనీయ పరమాత్మయందు ఐక్యస్థితిని పొందుతాడో అప్పుడు అభయస్థితిని పొందుతాదని (అథ సో-భయం గతో భవతి) అని తైత్తిరీయోపనిషత్తు వక్కాణిస్తుంది.
ప్రతి క్షణం నా వెన్నంటి ఉండి, నా భయాలన్నిటిని దూరం చేస్తున్న గీతామాతకు నిశ్చింత మనస్సుతో ప్రణామం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!