మన శరీరంలో పిత్తులు వదలడం ఒక సహజ ప్రక్రియ. పేగుల్లో ఆహారం జీర్ణం అయ్యే సమయంలో గ్యాస్ ఏర్పడుతుంది. అయితే కొంతమందికి వాసనతో కూడిన పిత్తులు వస్తుంటాయి మరికొందరికి వాసన లేకుండా తరచుగా పిత్తులు వస్తుంటాయి. అయితే దీనిని వైద్య పరిభాషలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు అని అంటారు.
గ్యాస్ ఎప్పుడూ వాసనతో వచ్చే అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో జీర్ణం కాకపోతే వాసనలేని గ్యాస్ ఏర్పడుతుంది. పాలలో ఉండే లాక్టోస్, పండ్లలోని ఫ్రక్టోస్, షుగర్ ఫ్రీ ఉత్పత్తులలోని షుగర్ ఆల్కహాల్స్ పేగుల్లో తగినవిధంగా కరిగకపోవడం వలన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
గ్యాస్ ఎక్కువగా దుర్వాసనతో వస్తే అది జీర్ణక్రియలో సమస్య ఉన్న సంకేతం ఆహారం పేగులో ఎక్కువసేపు ఉండటం బ్యాక్టీరియా ఇమ్‌బ్యాలెన్స్ (డిస్బయోసిస్) మలబద్ధకం వంటి సమస్యలు ఉండడం వల్ల వాసనతో కూడిన పిత్తులు వస్తుంటాయి.ఈ పరిస్థితుల్లో పేగులోని బ్యాక్టీరియా ఆహార పదార్థాలను కరిగిస్తూ హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి దుర్వాసన గ్యాస్‌లను విడుదల చేస్తుంది. కొన్ని సార్లు SIBO(Small Intestinal Bacterial Overgrowth) కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది.
గ్యాస్ వదలడం సహజమే. అయితే అది తరచూ వస్తుంటే లేదా దుర్వాసనతో ఉంటే, శరీరం కొన్ని ఆహారాలను సరిగా జీర్ణం చేయలేకపోతుంది అని అర్థం. సరైన ఆహారం, నీరు, వ్యాయామం, చేయడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా యోగాసనాల ద్వారా ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు తెలుపుతున్నారు.
ఆహార నియమాలను మార్చుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఉప్పు మరియు పాల ఉత్పత్తులతో తయారైన వాటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. రోజు మీ ఆహారంలో అరటిపండు ఉండేలా చూసుకోండి. అరటిపండు తీసుకోవడం ద్వారా మలవిసర్జన త్వరగా అవుతుంది. అప్పుడు పిత్తులు వంటి సమస్యలు మీ దరికి చేరవు.
ఎప్పుడు జాగ్రత్త పడాలి
గ్యాస్ తరచూ వస్తుంటే దుర్వాసన ఎక్కువగా ఉంటే
కడుపులో ఉబ్బరం, నొప్పి, మలవిసర్జనలో మార్పులు
కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు పరీక్షల ద్వారా సమస్యను గుర్తించి సరైన ట్రీట్మెంట్ సూచిస్తారు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఈ సమస్య అధికమైతే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవలెను.