Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! India: జర జాగ్రత్త.. అది కేవలం ఎండ మాత్రమే కాదు.. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతతో పెరుగుతున్న ప్రాణాపాయం - మెదడుకు ముప్పు! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! India: జర జాగ్రత్త.. అది కేవలం ఎండ మాత్రమే కాదు.. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతతో పెరుగుతున్న ప్రాణాపాయం - మెదడుకు ముప్పు! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం!

US FDA: US కల్తీ కాఫ్ సిరప్‌లపై US FDA ఆరా.. భారత CDSCO నుంచి వివరాలు!

అంతర్జాతీయంగా ఆందోళన దేశవ్యాప్తంగా కలకలం రేపిన “కోల్డిఫ్” కాఫ్ సిరప్ ఘటనపై ఇప్పుడు అమెరికా కూడా స్పందించింది. భారతదేశంలో 22 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ

Published : 2025-10-11 21:34:00
APSDMA warns: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం.. APSDMA హెచ్చరిక!

అంతర్జాతీయంగా ఆందోళన దేశవ్యాప్తంగా కలకలం రేపిన “కోల్డిఫ్” కాఫ్ సిరప్ ఘటనపై ఇప్పుడు అమెరికా కూడా స్పందించింది. భారతదేశంలో 22 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ విషపూరిత మందుల వ్యవహారంపై యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి వివరాలు కోరింది. దీనికి ప్రతిస్పందనగా CDSCO “కోల్డిఫ్” సిరప్ అమెరికా లేదా ఏ ఇతర దేశానికీ ఎగుమతి కాలేదని తెలిపింది.

Ration Alert: చిన్న తప్పుతోనే రేషన్ కార్డు రద్దు..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

రాయిటర్స్ నివేదిక ప్రకారం, భారతదేశం నుంచి “కోల్డిఫ్” సిరప్ ఎగుమతికి సంబంధించిన ఎటువంటి రికార్డులు లేవని CDSCO స్పష్టం చేసింది. అయినప్పటికీ, అమెరికా FDA ఈ సంఘటనను అత్యంత ప్రాముఖ్యతతో తీసుకుంటోంది. “ఈ మందులు US మార్కెట్లోకి రాకుండా పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉన్నాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఔషధం కఠిన నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి. ఎటువంటి మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైన పదార్థాలు ఉండకూడదు” అని FDA ప్రతినిధి పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల నోటిఫికేషన్..! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ..!

తమిళనాడు కేంద్రంగా ఉన్న “Sresan” ఫార్మా కంపెనీ తయారు చేసిన కోల్డిఫ్ సిరప్‌లో డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) మరియు ఇథిలిన్ గ్లైకాల్ (EG) అనే అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులు తేల్చాయి. ఈ పదార్థాలు సాధారణంగా ఇండస్ట్రియల్ యూజ్‌కే ఉపయోగిస్తారు. అయితే, అవి తాగినప్పుడు మానవ శరీరానికి విషముగా మారి లివర్, కిడ్నీ, నర్వస్ సిస్టమ్‌ను దెబ్బతీస్తాయి. అదే కారణంగా చిన్నారుల్లో విష ప్రభావం తీవ్రంగా మారి ప్రాణాలు కోల్పోయారు.

Lahore city Pakistan: ఇజ్రాయెల్ దాడులపై నిరసన.. పాక్‌లో లాహోర్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత!

ఈ ఘటన తరువాత భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా యూనిట్లపై సడన్ ఇన్‌స్పెక్షన్లు ప్రారంభించింది. రాష్ట్ర స్థాయి డ్రగ్ కంట్రోల్ విభాగాలు కూడా నాణ్యత నియంత్రణ వ్యవస్థను కఠినతరం చేశాయి. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే సిరప్లు, యాంటీబయోటిక్స్, టానిక్‌లు వంటి ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చారు.

Supreme court: వాట్సాప్ ఖాతా బ్లాక్ చేశారని కోర్టుకెళితే..! దేశీయ యాప్ ‘అరట్టై’తో..!

అమెరికా FDA ఇప్పటికే పలు దేశాల్లో భారతీయ సిరప్‌ల వల్ల జరిగిన మరణాలను గుర్తుచేసింది. గతంలో గాంబియా, ఉజ్బెకిస్తాన్, కెమరూన్ దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారత సిరప్‌లపై అంతర్జాతీయ దృష్టి పడింది. “మనం నాణ్యతపై మరింత జాగ్రత్తగా ఉండకపోతే, దేశ ఫార్మా రంగం విశ్వసనీయత కోల్పోతుంది” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

AP Police Jobs: ఏపీ పోలీస్ శాఖలో రికార్డు స్థాయి ఉద్యోగాలు..! నిరుద్యోగులకు బంపర్ అవకాశం..!

ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వం Sresan Laboratories లైసెన్సును సస్పెండ్ చేయగా, ఫ్యాక్టరీ సీలింగ్ చర్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కంపెనీ డైరెక్టర్లు అండర్‌గ్రౌండ్ అయ్యారని సమాచారం. సీబీఐ కూడా ఈ ఘటనపై ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించింది. వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. “బయట లభించే సిరప్ లేదా టానిక్‌లను పిల్లలకు ఇవ్వకూడదు. ప్రభుత్వంగా అనుమతించబడిన ఫార్మసీల నుంచే మందులు కొనాలి” అని హెచ్చరించారు.

CDSCO: ఇది ఒక కంపెనీ తప్పు కాదు.. మొత్తం వ్యవస్థ వైఫల్యం.. CDSCO వ్యాఖ్య!

ఇక US FDA, CDSCO మధ్య సమాచార మార్పిడి కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ స్థాయిలో భారత ఔషధ నాణ్యతను మెరుగుపర్చేందుకు కఠినమైన రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయని సమాచారం. ఈ ఘటనతో “మేడ్ ఇన్ ఇండియా” ఫార్మా బ్రాండ్‌పై మరోసారి ప్రశ్నార్థకం ఏర్పడింది. 

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. భారత్ విజయం పై నీడ వేసిన నఖ్వీ నిర్ణయం!
వారమంతా వేచి చూసే ఆ 3 రోజులు ఇవే! పల్లెకు పయనమయ్యేందుకు సిద్ధంకండి!!
Ration Shops: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..! ఇక బియ్యం తో పాటు అన్ని సరుకులు ఒకేచోట..!
Farmer strength: రైతు చిరునవ్వే దేశ శక్తి.. రూ.35,000 కోట్లతో రెండు కొత్త వ్యవసాయ పథకాలు.. ప్రధాని మోదీ!

Spotlight

Read More →