IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్!

IND vs AUS Womens T20: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ కైవసం !

IND vs AUS Womens T20: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మహిళలు 2-1తో ద్వైపాక్షిక సిరీస్ గెలిచారు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి కీలకంగా రాణించారు.

Published : 2026-02-21 21:25:00
  • స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలు..
     
  • ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్ గెలిచిన భారత్..

IND vs AUS Womens T20: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో కంగారూలను ఓడించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధన (55 బంతుల్లో 82), జెమిమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59) అద్భుత అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశారు. ఇది అడిలైడ్ ఓవల్‌లో మహిళల టీ20ల్లో అత్యధిక స్కోరు కావడం విశేషం.

177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. ఆష్లీ గార్డ్‌నర్ (57) ఒంటరి పోరాటం చేసినా, ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్లు శ్రేయంక పాటిల్ (3/22), శ్రీ చరణి (3/32) తమ మాయాజాలంతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టి, 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులకే కట్టడి చేశారు.

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళల జట్టుకు 2016 తర్వాత ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. మరోవైపు, సొంతగడ్డపై 2017 తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ చారిత్రాత్మక విజయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది.

Spotlight

Read More →