Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా? Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Waste To Wonder: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్.... చెత్తతో వండర్స్ చేస్తే రూ. 22.5 లక్షల ప్రైజ్ మనీ! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా?

Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.!

Contaminated Milk in Rajahmundry: రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధి ప్రభావంతో నలుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కలుషిత పాల వల్లే ఈ సమస్య తలెత్తిందనే అనుమానంతో అధికారులు డెయిరీలను సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

Published : 2026-02-23 12:23:00
  • శాంపిల్స్ సేకరణ - ఫలితాల కోసం నిరీక్షణ..
     
  • పాలు, పెరుగుపై అనుమానాలు..
     
  • అందుబాటులో కంట్రోల్ రూమ్..

Contaminated Milk in Rajahmundry: రాజమహేంద్రవరం నగరంలో అకస్మాత్తుగా వెలుగుచూసిన అనూరియా సమస్య ప్రజలను భయాందోళనకు  గురిచేస్తుంది. బాధితుల్లో మూత్రపిండాల పనితీరు మందగించడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, వ్యాధి నిర్ధారణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పటివరకు ఈ వ్యాధి ప్రభావంతో తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు అనే నలుగురు మరణించినట్లు అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ అనారోగ్య సమస్యలకు కలుషిత పాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి పాలు, పెరుగు నమూనాలను సేకరించింది. మొత్తం 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతుండగా, అనుమానిత పాల వ్యాపారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా, అనధికారికంగా నడుపుతున్న ఒక డెయిరీని అధికారులు సీజ్ చేశారు.

వ్యాధి మూలాలను కనుగొనేందుకు అధికారులు ఇప్పటివరకు 73 రకాల శాంపిల్స్ సేకరించారు. వీటిలో బాధితుల రక్త నమూనాలతో పాటు, వారు వాడిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి ల్యాబ్ ఫలితాలు వచ్చే అవకాశం  ఉండనుంది. ఆ నివేదికలు వస్తేనే అసలు సమస్య ఎక్కడ ఉందో స్పష్టత వస్తుంది అని అధికారులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం విజయవాడ నుంచి కూడా రాజమహేంద్రవరం చేరుకుంది. వీరు స్థానిక వైద్యులతో కలిసి వ్యాధి లక్షణాలను, చికిత్స విధానాలను సమీక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో 8 మంది చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా నీరసం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

ప్రజల సహాయార్థం అధికారులు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా ఎవరైనా అనారోగ్యానికి గురైనా వెంటనే 94940 60060 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని  స్పష్టం చేశారు.

Spotlight

Read More →