శీతాకాలం సీజన్ ప్రారంభమైతే చలితో పాటు గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల గొంతు నుంచి ఛాతీ వరకు అసౌకర్యం మొదలవడం చాలా సాధారణం. తెల్లవారుజామున లేవగానే గొంతు పొడిబారినట్టుగా అనిపించడం, రోజు మొత్తం స్వల్ప దగ్గు వేధించడం, చల్లని గాలి తగిలితే ఛాతీలో కొద్దిగా భారంగా అనిపించడం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా కనిపించే సమస్యలు. బయట చలిని తగ్గించేందుకు , జాకెట్లు ఉపయోగిస్తామే కాని మన వంటగదిలోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలు ఈ seasonal discomfort ను సహజంగా తగ్గించే చిన్న మందుల్లా పని చేస్తాయి.
తరతరాలుగా వస్తున్న ఈ గృహచికిత్సలు చలికాలంలో త్వరిత ఉపశమనం అందిస్తాయని నమ్మకం. చలి ఎక్కువైన రోజులలో గొంతు చికాకులు, పొడి దగ్గు, ఛాతీ ఇబ్బందులు అధికమవుతాయి. ఇలాంటి సమయంలో పసుపు నుంచి అల్లం వరకు, తులసి నుంచి మూలెఠి వరకు కొన్ని భారతీయ పదార్థాలు గొంతును వెచ్చగా ఉంచి, శ్వాసనాళాల్లోని వాపును తగ్గించి, ఎండిపోయిన గొంతుకు తేమను అందిస్తాయి. శాస్త్రీయ పరిశోధనలు కూడా వీటి సహజ యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలపై మద్దతు ఇస్తున్నాయి.
పసుపు భారతీయుల ఆరోగ్య రక్షకంగా పేరొందిన పదార్థం వేడి పసుపు నీరు లేదా పసుపు పాలు గొంతును కప్పి తక్షణ వెచ్చదనాన్ని ఇస్తాయి. చల్లని గాలితో గొంతులో కలిగే చికాకును తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అల్లం కూడా చలికాలం సీజన్‌లో అత్యంత ఉపయోగకరమైన పదార్థం. దీని వేడి స్వభావం శ్వాసనాళాల్లోని వాపును తగ్గించి, దగ్గును నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం టీ లేదా తేనెతో అల్లం నమలడం గొంతు ఇర్రిటేషన్‌ను తగ్గిస్తుంది.
తులసి ఆకులు చలికి ముఖ్యమైన రక్షణ ఇవి శ్వాస వ్యవస్థను శుభ్రపరచి, శ్వాస పీల్చుకునే సమయంలో ఉన్న కష్టాన్ని తగ్గిస్తాయి. తులసి టీ congestionను తగ్గించి ఛాతీ ప్రాంతంలో ఉన్న అసౌకర్యాన్ని సడలిస్తుంది. నల్ల మిరియాలు శ్లేష్మం కరిగించి చలి వల్ల ఎక్కే గడ్డకట్టిన కఫాన్ని బయటకు రానిస్తాయి. వేడి కషాయాల్లో మిరియాలు వేసుకుంటే వేగంగా ఉపశమనం లభిస్తుంది.
అయితే ఇవన్నీ చిన్నపాటి లక్షణాలకు మాత్రమే ఉపశమనం ఇవ్వగలవు. చలికాలం తీవ్రత వల్ల శ్వాస సమస్యలు పెరిగితే వైద్య సలహా తప్పనిసరి. అయినా, ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం శరీరాన్ని చలికాలంలో రక్షించడంలో కొంత వరకు సహాయపడుతుంది.
ఉదయం వేడి అల్లం నీళ్లతో రోజును ప్రారంభించడం, సాయంత్రం పసుపు హనీ మిశ్రమం తాగడం, రాత్రి అజ్వైన్ ఆవిరి తీసుకోవడం వంటి సులభ పద్ధతులు శరీరానికి వెచ్చదనం ఇచ్చి అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఈ శీతాకాలం సీజన్‌లో మీ వంటగదిలోని సహజ పదార్థాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇవి చలితో వచ్చే చిన్న చిన్న సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తాయి.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ని సంప్రదించి మీరు ఆరోగ్యానికి సూచనలు తీసుకోవడం మంచిది.