వెచ్చ వెచ్చగా కుక్కర్ మసాలా చాయ్! దీని రుచికి బయట తాగే టీలు వెంటనే మానేస్తారు!

Street Style Cooker Chai Recipe:వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీ తాగుతూ.. కరకరలాడే సమోసా తింటే ఆ మజానే వేరు. ముఖ్యంగా టీ స్ట్రాంగ్‌గా ఉండి, సమోసా మంచి రుచితో ఉంటే ఆ అనుభూతే ప్రత్యేకం. అయితే ప్రతిసారీ బయటకు వెళ్లి స్ట్రీట్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫేమస్ అవుతున్న దమ్‌కా చాయ్ (కుక్కర్ టీ)తో పాటు ఆంధ్రా స్టైల్ ఉల్లి సమోసాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి వీటి తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.

Cooker Chai and Onion Samosa Recipe
Cooker Chai and Onion Samosa Recipe
  • కుక్కర్‌లో ఆవిరి మీద మసాలాలతో తయారుచేసే స్ట్రాంగ్ దమ్‌కా చాయ్.
  • వర్షాకాలంలో టీతో పాటు ఆస్వాదించేందుకు పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫుడ్ కాంబినేషన్.

Street Style Cooker Chai Recipe: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీ తాగుతూ.. కరకరలాడే సమోసా తింటే ఆ మజానే వేరు. ముఖ్యంగా టీ స్ట్రాంగ్‌గా ఉండి, సమోసా మంచి రుచితో ఉంటే ఆ అనుభూతే ప్రత్యేకం. అయితే ప్రతిసారీ బయటకు వెళ్లి స్ట్రీట్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫేమస్ అవుతున్న దమ్‌కా చాయ్ (కుక్కర్ టీ)తో పాటు ఆంధ్రా స్టైల్ ఉల్లి సమోసాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి వీటి తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.

కుక్కర్‌లోనే స్ట్రాంగ్ దమ్‌కా చాయ్!

సాధారణంగా టీని స్టవ్‌పై మరిగించి తయారు చేస్తుంటారు. కానీ దమ్‌కా చాయ్ తయారీలో ప్రత్యేకత ఆవిరి. ముందుగా ఒక స్టీల్ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. కొత్త పల్చటి క్లాత్‌ను గిన్నెకు అమర్చి, అందులో మూడు టీస్పూన్ల టీ పొడి, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక టీస్పూన్ మిరియాలు వేయాలి.

మరోవైపు కుక్కర్‌లో పావు వంతు నీళ్లు పోసి, అందులో ఈ గిన్నెను అమర్చాలి. మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత గిన్నెను బయటకు తీసి క్లాత్‌ను నెమ్మదిగా తొలగిస్తే స్ట్రాంగ్ టీ డికాషన్ సిద్ధమవుతుంది.

తర్వాత మరో గిన్నెలో రెండు గ్లాసుల పాలు, మూడు టీస్పూన్ల చక్కెర వేసి బాగా మరిగించాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న డికాషన్ కలిపి రెండుసార్లు పొంగే వరకు మరిగిస్తే వేడి వేడి దమ్‌కా చాయ్ రెడీ. ఆవిరి మీద తయారయ్యే ఈ డికాషన్‌లో మసాలాల సువాసన బాగా కలిసి టీకి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

ఆంధ్రా స్టైల్ ఉల్లి సమోసా తయారీ ఇలా!

టీతో పాటు తినడానికి ఉల్లి సమోసా ఉంటే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. బయట స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో లభించే కరకరలాడే ఉల్లి సమోసాలను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు.

ముందుగా ఒక కప్పు మైదా, అర కప్పు గోధుమపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ సమోసా పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని సుమారు 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

సమోసా స్టఫింగ్ కోసం ఈ పదార్థాలు వాడాలి

స్టఫింగ్ తయారీకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కప్పు క్యాబేజీ, పావు కప్పు క్యారెట్, అర కప్పు నానబెట్టి ఉడికించిన బఠాణీలు తీసుకోవాలి. వీటిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అటుకులు కలపాలి. అనంతరం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా చక్కెర వేసి అన్నింటినీ బాగా కలపాలి. దీంతో సమోసా స్టఫింగ్ సిద్ధమవుతుంది.

సమోసాలకు కరకరలాడే క్రిస్పీ పొర ఇలా!

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీల్లా పల్చగా పెద్దగా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై రెండు వైపులా పూర్తిగా కాలకుండా కొద్దిగా మాత్రమే వేడి చేయాలి. అనంతరం అంచులను కత్తిరించి, మధ్యలోకి కట్ చేసి సమోసా పట్టీలుగా సిద్ధం చేసుకోవాలి.

ఒక్కో పట్టీని సమోసా ఆకారంలో మడిచి, అందులో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్‌ను నింపాలి. మైదాలో కొద్దిగా నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని అంచులకు రాసి సమోసాను గట్టిగా అతికించాలి.

తర్వాత కాగుతున్న నూనెలో సమోసాలను వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. మంచి బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు ఫ్రై చేసి బయటకు తీసుకోవాలి.

టీ.. సమోసా కాంబినేషన్‌తో వర్షాకాలాన్ని ఆస్వాదించండి!

అంతే.. వేడి వేడి దమ్‌కా చాయ్, కరకరలాడే ఆంధ్రా స్టైల్ ఉల్లి సమోసాలు సిద్ధం. బయట స్ట్రీట్ ఫుడ్ కోసం వెతకకుండా ఇంట్లోనే ఈ రెండు రుచులను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా వర్షం పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ కాంబినేషన్‌ను రుచి చూస్తే ఆ ఆనందమే వేరు. ఒకసారి ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి!

Tags

Be the first to react

Latest