అర్నబ్ తుపాన్ నష్టంపై స్పందించిన ఎస్‌బీఐ.. CM నిధికి రూ.5.01 కోట్ల సాయం!

అమరావతి: అర్నబ్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుపాన్ బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

SBI Donates Rs 5.01 Crore to AP CM Relief Fund for Cyclone Victims
SBI Donates Rs 5.01 Crore to AP CM Relief Fund for Cyclone Victims
  • అర్నబ్ తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది.
  • ఎస్‌బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు బృందం సీఎం చంద్రబాబుకు రూ.5.01 కోట్ల విరాళం అందించింది.

అమరావతి: అర్నబ్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుపాన్ బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా రూ.5 కోట్ల 1 లక్షకు సంబంధించిన చెక్కును సీఎంకు అందజేసింది.

తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా విరాళం అందించిన ఎస్‌బీఐ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను తదితరులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest