నల్ల నువ్వులు vs తెల్ల నువ్వులు! ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచివి?

Black Sesame vs White Sesame: నువ్వులు మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. నువ్వుల లడ్డూలు, చట్నీలు, స్వీట్లు ఇలా అనేక రకాల వంటకాల్లో వీటిని వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో ప్రధానంగా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య రంగులోనే కాదు.. పోషక విలువలు, రుచి, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ కొన్ని తేడాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏవి తీసుకుంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది?

నల్ల నువ్వులు vs తెల్ల నువ్వులు! ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచివి?
sesame seeds healthy benifits
  • నల్ల నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.
  • తెల్ల నువ్వులు తేలికపాటి రుచితో రోజువారీ వంటకాలకు అనుకూలంగా ఉంటాయి.

Black Sesame vs White Sesame: నువ్వులు మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. నువ్వుల లడ్డూలు, చట్నీలు, స్వీట్లు ఇలా అనేక రకాల వంటకాల్లో వీటిని వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్లో ప్రధానంగా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య రంగులోనే కాదు.. పోషక విలువలు, రుచి, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ కొన్ని తేడాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏవి తీసుకుంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది?

నల్ల నువ్వుల్లో పోషకాల ప్రత్యేకత ఏమిటి?

నల్ల నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటి పైపొట్టులో కూడా అనేక పోషకాలు ఉండటంతో సాధారణంగా పొట్టుతోనే వినియోగిస్తారు. ఇవి ఎముకల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించడంలో సహాయపడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి.

తెల్ల నువ్వుల ప్రత్యేకతలు ఇవే!

తెల్ల నువ్వులు తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని స్వీట్లు, సలాడ్లు, బ్రెడ్‌లు, చట్నీలు వంటి అనేక ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. వీటిలోనూ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే మార్కెట్లో లభించే చాలా తెల్ల నువ్వుల పైపొట్టును తొలగించి విక్రయిస్తారు. అందుకే ఇవి నల్ల నువ్వులతో పోలిస్తే మెత్తగా ఉంటాయి.

రంగు మాత్రమే కాదు.. రుచిలోనూ వ్యత్యాసం!

నల్ల నువ్వులు కొంచెం ఘాటైన, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని ముఖ్యంగా ఆసియా వంటకాలు, స్వీట్లు, సాస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. తెల్ల నువ్వులు మాత్రం తేలికపాటి రుచితో ఉండటంతో వివిధ రకాల వంటకాలకు చక్కగా సరిపోతాయి. ఆహార పదార్థాలపై అలంకరణ కోసం కూడా వీటిని వినియోగిస్తారు.

పోషకాల విషయంలో దేనికి ఎక్కువ మార్కులు?

నల్ల నువ్వుల్లో ఉండే సహజ వర్ణద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే పొట్టుతో సహా తీసుకునే నువ్వుల్లో కొన్ని ఖనిజాలు ఎక్కువగా లభించవచ్చు. తెల్ల నువ్వుల్లోనూ శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి నల్ల నువ్వులే ఉత్తమమని, తెల్ల నువ్వులు తక్కువని పూర్తిగా చెప్పలేం. వాటి ప్రాసెసింగ్ విధానం, పొట్టు ఉండటం లేదా తొలగించడం ఆధారంగా 
పోషక విలువలు మారుతుంటాయి.

నువ్వుల ప్రయోజనాలు పొందాలంటే ఇలా నిల్వ చేయండి!

నువ్వుల్లో సహజంగానే నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే వాటి రుచి, నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. వీటిని గాలి చొరబడని డబ్బాల్లో వేసి చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వంటల్లో ఉపయోగించే ముందు తక్కువ మంటపై వేయిస్తే మంచి సువాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది.

మొత్తంగా చూస్తే.. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు రెండూ పోషకాలతో కూడినవే. రుచి, వినియోగం, పోషక అవసరాలను బట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. సరైన పరిమాణంలో తీసుకుంటే రెండింటి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Tags

Be the first to react

Latest