సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు హోటల్‌లోనే బస!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కీలక రాజకీయ వ్యూహానికి తెరతీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు (హార్స్ ట్రేడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
- ఎమ్మెల్యేల కొనుగోలు ప్రచారం నేపథ్యంలో విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో మహాబలిపురంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
- ఎమ్మెల్యేలంతా మూడు రోజుల పాటు ఫైవ్‌స్టార్ హోటల్‌లోనే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కీలక రాజకీయ వ్యూహానికి తెరతీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు (హార్స్ ట్రేడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మూడు రోజుల పాటు ఒకే హోటల్‌లో ఎమ్మెల్యేలు
తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఎమ్మెల్యేలంతా మూడు రోజుల పాటు అదే హోటల్‌లో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు మినహా ఇతర వ్యక్తులకు హోటల్‌లోకి ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోటల్ పరిసరాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రచారంతో అలర్ట్
ఇటీవల టీవీకే ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు సంప్రదిస్తూ బేరసారాలు సాగిస్తున్నారన్న ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై విజయ్ దృష్టి సారించినట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఇతర పార్టీల ప్రలోభాలకు గురవుతున్నారా? పార్టీ అంతర్గతంగా ఏవైనా విభేదాలు ఉన్నాయా? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేలపై చర్చ?
మరోవైపు టీవీకేకు చెందిన డిప్యూటీ స్పీకర్ వ్యవహారం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓ జిల్లా కలెక్టర్‌ను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అంశంపైనా విజయ్ చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ నేతల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యేలకు క్రమశిక్షణపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎమ్మెల్యేలందరినీ ఒకే చోట మూడు రోజుల పాటు ఉంచాలన్న విజయ్ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని తమిళనాడు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
Tags
Be the first to react