విశాఖ CII సదస్సుకు ముందే ఏపీ గుడ్‌న్యూస్.. రూ.17.2 లక్షల కోట్ల పెట్టుబడులు!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నం వేదికగా నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ CII భాగస్వామ్య సదస్సుకు ముందు భారీ పెట్టుబడుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో గణనీయమైన వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలో విజయం సాధించినట్లు ప్రకటించింది.
- ఏపీలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన 526 పెట్టుబడి ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చాయి.
- ఈ ప్రాజెక్టుల ద్వారా 19.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నం వేదికగా నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ CII భాగస్వామ్య సదస్సుకు ముందు భారీ పెట్టుబడుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో గణనీయమైన వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంలో విజయం సాధించినట్లుAndhra Pradesh investments ప్రకటించింది.
526 ప్రాజెక్టులకు ముందడుగు
2024 జూన్ నుంచి రాష్ట్రానికి మొత్తం 714 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి విలువ సుమారు రూ.22.6 లక్షల కోట్లు. వీటిలో 526 ప్రాజెక్టులను ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.17.2 లక్షల కోట్లు. అంటే మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో విలువ పరంగా దాదాపు 76 శాతం ప్రాజెక్టులు ముందుకు సాగాయి. వీటి ద్వారా సుమారు 19.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
మరో 188 ప్రాజెక్టులు, రూ.5.4 లక్షల కోట్ల పెట్టుబడులతో వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే 303 ప్రాజెక్టులు రూ.7.1 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమయ్యాయి లేదా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 7.7 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
భారీ పెట్టుబడులు.. కీలక రంగాలు
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, ఉక్కు, పునరుత్పాదక ఇంధనం, పెట్రోకెమికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రతిపాదించబడ్డాయి.
పూడిమడకలో NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. నక్కపల్లిలో AM/NS ఇండియా రూ.1.36 లక్షల కోట్లతో సమగ్ర ఉక్కు పరిశ్రమను ప్రతిపాదించింది. రామాయపట్నంలో BPCL రూ.96,862 కోట్లతో రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
అలాగే అనంతపురం ప్రాంతంలో రిలయన్స్ రూ.51,300 కోట్లతో సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. భోగాపురంలో GMR సంస్థ రూ.20 వేల కోట్లతో ఏవియేషన్ హబ్, విమానాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
గూగుల్, రిలయన్స్ ఏఐ ప్రాజెక్టులు
సాంకేతిక రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. విశాఖపట్నం ప్రాంతంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్, సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. భోగాపురం సమీపంలో రిలయన్స్ రూ.1.08 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్ల క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
నవంబర్ 12, 13 తేదీల్లో CII సదస్సు
ఈ భారీ పెట్టుబడుల పురోగతి నేపథ్యంలో విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ CII భాగస్వామ్య సదస్సు జరగనుంది. సుమారు 58 దేశాల నుంచి ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను పరిశ్రమలుగా మార్చడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఇప్పటికే ప్రకటించిన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చి పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి ప్రారంభం, స్థానికులకు ఉపాధి కల్పన వరకు చేరడం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సవాలుగా మారనుంది.
1 readers have reacted