Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయోత్సవ సభలో పాల్గొన్న గౌరవ మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషా గారు, నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు గారు..

Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా..
madanapalle celebrates the triumph of the two year coalition government
  • కష్టపడిన కార్యకర్తలకు త్వరలోనే నామినేటెడ్ పదవులతో న్యాయం.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!
  • మదనపల్లి విజయోత్సవ సభలో సందడి.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా, అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్లకు ఘన సన్మానం!

అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయోత్సవ సభలో పాల్గొన్న గౌరవ మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషా గారు, నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు గారు.. ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు షాజహాన్ భాషా గారిని మరియు నియోజకవర్గ పరిశీలకులు నెట్టెం వెంకటేష్ గారిని దుశ్యాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు మాట్లాడుతూ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధినేత, అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఈ కూటమి ప్రభుత్వం. యువతకు ఉద్యోగాలు ఇస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ,అదే విధంగా రాటకొండ మధుబాబు గారు మాట్లాడుతూ ప్రతి పక్షంలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పోలీస్ కేసులు సైతం పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలను పట్టించుకుని రాష్ట్ర అనుబంధ కమిటీల యందు మరియు జిల్లా అనుబంధ కమిటీలు మరియు నియోజకవర్గ స్థాయిలో త్వరితగతిన కమిటీలు వేసి కార్యకర్తలకు న్యాయం చేయవలసిందిగా మాట్లాడారు

ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ నాదెళ్ల విద్యాసాగర్ గారు ,బాలు స్వామి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ ,రాజంపేట పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, వంటి కొండ వెంకటేష్, పూల మురళి , నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, రామిశెట్టి నీలకంఠ మోడెం సిద్ధప్ప,పోతబోలు సుధాకర్ మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ saమస్తాన్ , మహిళా నాయకురాళ్లు విజయమ్మ ,తలారి రాధ, పులి మహాలక్ష్మి ,రాటకొండ భారతి ,బై గారి భారతి ,నాగమణి ,శ్యామల, జనసేన నాయకురాలు దారం అనిత, బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ,విజయభారతి స్కూల్ కరస్పాండెంట్ శేతు, నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మండలాల అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు, ఎంపీపీలు,జడ్పిటిసిలు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest