Praja Vedika: గ్రామ కంఠం భూమిలో వైసీపీ మాజీ సర్పంచ్ కొడుకు దౌర్జన్యంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! మూడేళ్ల తర్వాత వీఆర్వో అండతో..
Praja Vedika: అన్నమయ్య జిల్లా సదుం మండలం ఇందార్లవారిపల్లె గ్రామానికి చెందిన నాగరాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 228 లో గల 'గ్రామ కంఠం' భూమి ఉంది.
- Politics: రెవెన్యూ అధికారుల మాయాజాలం.. రికార్డులున్నా దక్కని న్యాయం..
- వైసీపీ హయాంలో కాలిబాట కబ్జా.. ఇళ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు..
Praja Vedika: అన్నమయ్య జిల్లా సదుం మండలం ఇందార్లవారిపల్లె గ్రామానికి చెందిన నాగరాజు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 228 లో గల 'గ్రామ కంఠం' భూమి ఉంది. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ మాజీ ప్రెసిడెంట్ కె. కృష్ణారెడ్డి కుమారుడైన కె. గౌరి కుమార్ రెడ్డి అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా తన సొంత పొలం కోసం బోరు బావిని వేసుకున్నాడు. గ్రామం నడిబొడ్డున, అందరికీ ఉపయోగపడాల్సిన ఉమ్మడి స్థలంలో ఇలా ప్రైవేట్ బోరు బావి ఎలా తవ్వుతారని ఊరి ప్రజలందరూ కలిసి ఆయనను నిలదీశాను. దీనికి సదరు వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా... "మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, నన్నెవరూ ఏమీ చేయలేరు" అంటూ తనపై, గ్రామస్థులపై తీవ్రంగా దౌర్జన్యం చేస్తూ, బెదిరింపులకు దిగాడు. గత ప్రభుత్వ అండతో విర్రవీగుతూ, ఇప్పటికీ ఉమ్మడి ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఈ అక్రమ బోరు బావి వ్యవహారంపై తహశీల్దార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోని ప్రభుత్వ భూమిని కాపాడాలని నేతలు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్, టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దేవినేని ఉమా మహేశ్వరరావులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన రమేష్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన స్థలాన్ని (డాక్యుమెంట్ నెం. 6795/2017) కొర్రపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తికి అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాను. అయితే, శ్రీనివాసరావుకు బ్యాంకు లోన్ రావడంలో సమస్య ఎదురైంది. ప్లాన్ అప్రూవల్ కోసం ఒక 30 గజాల స్థలాన్ని పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలని, అప్రూవల్ తన పేరు మీదే వస్తుందని శ్రీనివాసరావు నమ్మించడంతో తాను డిసెంబర్ 2023లో ఆ 30 గజాల స్థలాన్ని పోతేపల్లి పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశాను. దాదాపు రెండు నెలల తర్వాత తనకు అసలు నిజం తెలిసింది. శ్రీనివాసరావు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పాత డాక్యుమెంట్ల నుండి తన సంతకాలను ఫోర్జరీ చేశాడు. లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్, పంచాయతీ సెక్రటరీ సహకారంతో తన పేరు మీదే ప్లాన్ అప్రూవల్ బ్లూ ప్రింట్ మార్చేసి, దొంగతనంగా పర్మిషన్లు పొందాడు. ఈ అక్రమ అప్రూవల్ పత్రాలను చూపెట్టి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పామర్రు బ్రాంచ్ నుండి శ్రీనివాసరావు తన పేరు మీద భారీ లోన్ చేయించుకున్నాడు. ఈ భారీ మోసంలో కొనుగోలుదారుడితో పాటు బ్యాంకు మేనేజర్, మధ్యవర్తి, ప్రభుత్వ అధికారులు చేతులు కలిపారు. తానే స్వయంగా అక్రమంగా ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నానని, తనకు ఎలాంటి భయం లేదంటూ నిందితుడు శ్రీనివాసరావు తనకి వాట్సాప్లో మెసేజ్ పంపి బరితెగింపు ప్రదర్శించాడు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీముగానిపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమకు తమ గ్రామంలో నాలుగు గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తమకు 22 జూలై 2008న కుటుంబ సభ్యుల ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యింది. అప్పటి నుండి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే, పుంగనూరు టౌన్ కొత్త ఇండ్ల ప్రాంతానికి చెందిన గి. విక్రమ్ రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆ భూమిపై కన్నేసి, దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం సమయంలో విక్రమ్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమ భూమిలోకి చొరబడి, అక్కడ కంచె వేయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించి "తమ భూమిలో కంచె ఎందుకు వేస్తున్నావు?" అని నిలదీశాను. దీంతో ఆగ్రహానికి గురైన విక్రమ్ రెడ్డి అతని అనుచరులు తమని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిడుతూ, దాడికి తెగబడ్డారు. కొట్టడానికి ప్రయత్నిస్తూ, జాకెట్ లాగి, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా అవమానించారు. చుట్టుపక్కల వారు చూస్తున్నారనే భయం కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన వేమూరి శ్రీలత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..2015లో గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, కుర్నూతల గ్రామంలో ఒక ఎకరా వ్యవసాయ భూమిని (సర్వే నెంబర్: 215/ఎ2, 215/బి) కొనుగోలు చేశాం. అప్పట్లో ఎంటెక్ చదువుతున్న తమ ఏకైక కుమారుడు వేమూరి అయ్యప్ప పేరున ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాం. 2019లో అయ్యప్పకు గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వున్నం కోటేశ్వరరావు, రమాదేవిల కుమార్తె అభిలాషతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (తేజాన్ - 2020), ఒక కుమార్తె (రోషిణి - 2023) జన్మించారు. అయితే, భార్యాభర్తల మధ్య తలెత్తిన తగాదాల కారణంగా మనస్తాపానికి గురైన తన కుమారుడు 2023 మార్చిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కుమారుడు చనిపోయిన 11వ రోజే (పెద్ద కర్మ నాడే) భార్య అభిలాష తమతో గొడవపడి, బలవంతంగా పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. కుమారుడు మరణించిన మూడేళ్ల తర్వాత, ఎవరికీ తెలియకుండా అయ్యప్ప పేరున ఉన్న ఆ ఎకరా భూమిని కుర్నూతల వి.ఆర్.ఓ జే. వెంకటేశ్వరరావు సహకారంతో కేవలం వున్నం అభిలాష పేరు మీదకు మాత్రమే మ్యుటేషన్ మార్పించారు. ఐదు నెలల క్రితమే గుట్టుచప్పుడు కాకుండా పొలం డాక్యుమెంట్ల నకళ్లు తెప్పించుకుని, అభిలాష పేరు మీద పాస్ పుస్తకాలు కూడా జారీ చేయించుకున్నారు. ఆ ఆస్తి పిల్లలకు చెందకుండా రహస్యంగా దాన్ని అమ్ముకోవడానికే అభిలాష ఈ అక్రమ మ్యుటేషన్ చేయించింది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వెంకట శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..జి.కొండూరు గ్రామంలోని 118 నంబర్ గల ప్లాట్ను 'కోట శ్రీనివాసరావు' అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాను. అయితే, కొనుగోలు చేసిన సమయంలో సదరు వ్యక్తి ప్లాట్కు సంబంధించిన సరైన సరిహద్దులను చూపించకుండా కాలయాపన చేశాడు. ప్రస్తుతం ఆ లేఅవుట్ స్థలంలో కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులు, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. తన ప్లాట్ను చూపించాలని అధికారులను కోరగా... "అక్కడ ప్లాట్ ఏమీ లేదు" అని రెవెన్యూ సిబ్బంది నోటిమాటగా చెబుతున్నారు. ఒకవేళ ప్లాట్ లేకపోతే... అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, తహశీల్దార్ కార్యాలయం నుండి ఎలాంటి అధికారిక పత్రం ఇవ్వడం లేదు. అటు భూమిని అమ్మిన కోట శ్రీనివాసరావు మాత్రం "ప్లాట్ అక్కడే ఉంది" అని చెబుతున్నాడే తప్ప, హద్దులు చూపించడానికి ముందుకు రావడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన రాంప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి తోట లింగారావుకు తమ గ్రామ పరిధిలోని సర్వే నెం. 333/8, 239/12, 339/15 లలో మొత్తం 0.89 సెంట్ల భూమిని ప్రభుత్వం డి-పట్టా కింద మంజూరు చేసింది. నాటి నుండి నేటి వరకు దాదాపు 30 సంవత్సరాలుగా ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉంది. ఆ పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే తమ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన చిదట మారేశ్వరరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ భూమిపై కన్నేసి, దాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏలాంటి హక్కులు లేకపోయినా... ఆ భూమి తనదేనంటూ తమను బెదిరిస్తూ అన్యాయంగా గొడవలకు దిగుతున్నాడు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని రౌడీయిజంతో లాక్కోవాలని చూస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react