LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.

Kasthuri S 2 min read
Liquor Scam
Liquor Scam

కల్తీ మద్యంతో వేల కుటుంబాలకు నష్టం.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా ఫైర్..

మద్యం ఆదాయంగా మార్చిన పాలనకు ప్రజలే బుద్ధి చెప్పారు: మంత్రి డోలా..

అమరావతి: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. మద్యం కుంభకోణంపై రోజుకో కొత్త విషయం బయటకు వస్తోందని, ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయని ఆయన అన్నారు.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా చేసే సమయంలో పెంచిన ఛార్జీల ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. బేవరేజెస్ సంస్థలో కీలక పదవులు ఇచ్చి భారీగా అక్రమాలు చేశారని అన్నారు.

మద్యం కుంభకోణంపై సమాధానం చెప్పాల్సిన వారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన వ్యక్తుల పాత్రపై కూడా విచారణలో అంశాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

కల్తీ మద్యం వల్ల అనేక కుటుంబాలు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కేవలం ఆదాయం కోసమే గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. జె-బ్రాండ్స్ పేరుతో విక్రయించిన మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం వ్యవహారాల్లో పలువురు నేతల ప్రమేయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి తెలిపారు. కొందరు నాయకులను విచారణ సంస్థలు ప్రశ్నిస్తున్న అంశాలను ప్రజలు గమనించాలని అన్నారు. మద్యం కుంభకోణంలో అసలు లబ్ధిదారులు ఎవరో విచారణలో తేలుతుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని పూర్తిగా మార్చామని మంత్రి వివరించారు. నాణ్యమైన మద్యం సరఫరా కోసం కొత్త విధానం తీసుకొచ్చామని, నకిలీ మద్యం నియంత్రణకు ప్రత్యేకంగా “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల పరీక్షలు నిర్వహించి మద్యం నాణ్యతను నిర్ధారిస్తున్నామని చెప్పారు.

మద్యం దుకాణాల కేటాయింపులో పారదర్శకత తీసుకొచ్చామని, 3,396 షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించామని మంత్రి తెలిపారు. పేదలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించే చర్యలు తీసుకున్నామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును బంగారం, రియల్ ఎస్టేట్, సినిమాలు, విదేశాల్లో పెట్టుబడులు వంటి మార్గాల్లోకి మళ్లించారనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని మంత్రి అన్నారు. విదేశాల్లో షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు జరిగిందన్న అంశాలు కూడా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత పాలన వల్ల ఏపీ వెనక్కి వెళ్లిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, అభివృద్ధి దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించాలని మంత్రి కోరారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మద్దతు ఇచ్చారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. మద్యం వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…