LIVE
Sports: క్రీడా ప్రతిభను కుల వివాదాల్లోకి లాగొద్దు.. సామాజిక ఐక్యతకు భంగం కలిగించొద్దు  •  Traffic Rules: 55 ఏళ్లు దాటిన వారికి అలెర్ట్... ఇకపై ఆ సర్టిఫికెట్ ఉంటేనే లైసెన్స్ రెన్యువల్!  •  Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. స్టార్టప్ పెట్టుబడులకు ఏపీని వేదికగా మార్చే దిశగా అడుగులు!  •  LPG New Rules: సామాన్యులకు షాక్... గ్యాస్ కనెక్షన్లపై కఠిన ఆంక్షలు! ఒక ఇంటికి ఒకటే సిలిండర్...  •  Indian Railways: గుంటూరు వాసులకు గుడ్ న్యూస్... పల్నాడు, సింహాద్రి ఎక్స్ప్రెస్ లలో భారీ మార్పు!  •  AP Politics: నాడు విజయసాయి.. నేడు విజయకుమార్... ఒకే స్కెచ్, అదే కుట్ర! ఎందుకీ కుల విద్వేషాలు...  •  Amaravati Eye: లండన్ ఐ తరహాలో రూ.159.2 కోట్లతో... కృష్ణా నది తీరాన 139 మీటర్ల భారీ ఫెర్రిస్ వీల్!  •  Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం!  •  Visakapatnam: విశాఖ 2.0 షురూ... భీమిలి టు భోగాపురం 40 కిలోమీటర్ల 'బే సిటీ'... సీఎం మాస్టర్ ప్లాన్!  •  Amaravati: నాలెడ్జ్ సిటీగా నవ్యాంధ్ర రాజధాని.. 22 విద్యాసంస్థలకు 844 ఎకరాలు...  • 
Politics

AP Politics: నాడు విజయసాయి.. నేడు విజయకుమార్... ఒకే స్కెచ్, అదే కుట్ర! ఎందుకీ కుల విద్వేషాలు...

AP Politics: ఏపీలో జరిగిన డిఎస్సీ (DSC) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అత్యధిక ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లతో కమ్మ కులస్తులే పొందారని మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. ఎంపికైన 382 మందిలో 51% బీసీలు, 29% ఎస్సీలు ఉండగా, కమ్మవారికి కేవలం 9 ఉద్యోగాలు (2.36%) మాత్రమే వచ్చాయి.

AndhraPravasi News Desk 2 min read
ఒకే స్కెచ్, అదే కుట్ర! ఎందుకీ కుల విద్వేషాలు
ఒకే స్కెచ్, అదే కుట్ర! ఎందుకీ కుల విద్వేషాలు
  • 382 ఉద్యోగాల్లో కమ్మవారికి కేవలం 9.. ఇదా ఆధిపత్యం మాజీ ఐఏఎస్ గారూ?
  • నాడు డీఎస్పీలు, నేడు డిఎస్సీలు: తప్పుడు ప్రచారంతో వైఎస్సార్సీపీ మైండ్ గేమ్.
  • ఆధారాలు లేని ఆరోపణలు.. మాజీ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేనా

AP Politics: రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టడం, అబద్ధాలను పదేపదే ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. 2018 సంవత్సరంలో అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో కమ్మ కులానికి చెందిన వారికి మాత్రమే ఎక్కువ పదవులు ఇచ్చారని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ అసత్య ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు దానినే నిజమని నమ్మి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రమోషన్ పొందిన వారిలో కేవలం ఐదుగురు మాత్రమే కమ్మ కులస్తులని చెప్పడంతో ఆ అబద్ధం బట్టబయలైంది.

గతంలో విజయసాయి రెడ్డి చేసిన తరహాలోనే, ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు విజయకుమార్ అదే కుట్రకు తెరతీశారు. ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ (DSC) స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో దొంగ సర్టిఫికెట్లతో కమ్మ కులస్తులే అత్యధికంగా ఉద్యోగాలు పొందారని ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. కోర్టుకు వెళ్లిన అభ్యర్థుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తాను ఈ విషయాలు చెబుతున్నానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాలు ఆయన చెప్పిన మాటలను పోస్టర్లుగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను మరియు డిఎస్సీ అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

అయితే, డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టమవుతోంది. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 421 ఖాళీలు ఉండగా, సరైన అర్హతలు (టెట్ ఉత్తీర్ణత మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం) ఉన్న 382 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ 382 మందిలో బీసీ కేటగిరీకి చెందిన వారు అత్యధికంగా 196 మంది (51 శాతానికి పైగా) ఎంపికయ్యారు. అలాగే వివిధ గ్రేడుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 112 మంది (29 శాతం), మరియు ఎస్టీ కేటగిరీకి చెందిన వారు 29 మంది (7 శాతం) ఈ ఉద్యోగాలు సాధించారు.

ఇక ఓసీ (OC) కేటగిరీ విషయానికి వస్తే, మొత్తం మీద కేవలం 42 మందికి (11.3 శాతం) మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో కూడా ఉప కులాల వారీగా లెక్కలు తీస్తే, కాపులు 16 మంది (40 శాతం), రెడ్లు 10 మంది (24 శాతం), కమ్మ వారు 9 మంది (21 శాతం), వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాలకు చెందిన వారు ఆరుగురు, మరియు ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు. అంటే మొత్తం 382 మంది ఎంపికైన వారిలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం తొమ్మిది మంది (2.36 శాతం) మాత్రమే ఉన్నారు. ఈ కచ్చితమైన లెక్కలు చూసిన తర్వాత కూడా మెజారిటీ ఉద్యోగాలు ఒకే కులానికి వెళ్లాయని ఒక మాజీ ఐఏఎస్ అధికారి చెప్పడం ఆయన సంకుచితత్వానికి నిదర్శనం.

రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్‌లో పడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వైఎస్సార్సీపీ అనుకూల వ్యక్తులు అవకాశం దొరికిన ప్రతిసారీ ఏదో ఒక కులం పేరుతో విషం చిమ్ముతున్నారు. గతంలో ఈ తరహా అబద్ధాలను ఉపేక్షించడం వల్లే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, ప్రజల ముందు అసలు వాస్తవాలను ఉంచడంతో పాటు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Be the first to react

More Coverage

Prakash Raj: నీట్ అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై యువత ఆందోళన.. ఫ్రీడమ్ పార్క్‌లో ప్రకాశ్ రాజ్ సంఘీభావం!

Prakash Raj: నీట్ అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై యువత ఆందోళన.. ఫ్రీడమ్ పార్క్‌లో ప్రకాశ్ రాజ్ సంఘీభావం!

Prakash Raj: నీట్-యూజీ 2026 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మ…

Nara Lokesh: అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి... క్షేత్రస్థాయి వీడియోతో మంత్రి లోకేశ్‌ కౌంటర్!

Nara Lokesh: అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి... క్షేత్రస్థాయి వీడియోతో మంత్రి లోకేశ్‌ కౌంటర్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా, ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతున…