Praja Vedika: బస్ స్టేషన్ లోని షాపులపై వైసీపీ నాయకులు కన్ను.. అద్దె చెల్లించకపోగా ఆపై.. అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు!
Praja Vedika: డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, ముక్కామల గ్రామానికి చెందిన కొందరు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “గ్రామంలోని సర్వే నెం. 76లో 0.25 సెంట్లు స్థలమును ఇరిగేషన్ డిపార్టుమెంట్ వారు గ్రామ పంచాయతీకి బదిలీ చేశారు.
- అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వైసీపీ మాజీ సర్పంచ్.. చేపల చెరువు పెట్టి ఆక్రమణ..
- Politics: తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని కుటుంబంపై మూకుమ్మడిగా దాడి..
Praja Vedika: డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, ముక్కామల గ్రామానికి చెందిన కొందరు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “గ్రామంలోని సర్వే నెం. 76లో 0.25 సెంట్లు స్థలమును ఇరిగేషన్ డిపార్టుమెంట్ వారు గ్రామ పంచాయతీకి బదిలీ చేశారు. సదరు స్థలము గ్రామ ముఖ్య కూడలిలో ఉండటంతో ప్రజా సౌకర్యార్థం 1997లో బస్ షెల్టర్ నిర్మించారు. ఇటీవల మాజీ సర్పంచ్ సదరు బస్ షెల్టర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పంచాయతీ ఆదాయము కొరకు పదమూడు షాపులు నిర్మించారు. ఆ తరువాత ఆ షాపుల్లోని కొన్ని స్థానిక వైసీపీ నాయకులు అనధికారికంగా ఆక్రమించారు. మరికొన్ని అద్దె కట్టకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.” దీనిపై రెవిన్యూ అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అర్జీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చినాపురం గ్రామానికి చెందిన తాడికొండ నాగిరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “1970 సంవత్సరంలో మా తాతగారు తాడికొండ రెడ్డికి ప్రభుత్వం అసైన్డ్ భూమి మంజూరు చేసింది. ఆ తర్వాత అది వారసత్వంగా ప్రస్తుతం నాకు సంక్రమించింది. సదరు భూమి సర్వే నెం. 153/3లో 2.13 ఎకరాలు, సర్వే నెం. 228/12లో 0.41 ఎకరాలకు సంబంధించి అడంగల్, రెవెన్యూ రికార్డులు, పంచనామా, స్వాధీన అప్పగింత పత్రాలు ఇతర ఆధారాలు నా వద్దనే ఉన్నాయి. ఈ భూమిలో YSRCP మాజీ ప్రెసిడెంట్ జన్ను రాఘవరావు అండదండలతో పండు రాజు, గాంధీ రాజు కిరణ్ కుమార్ అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు తవ్వారు. అంతే కాకా.. ఈ భూమిని పక్కనే ఉన్న 100 ఎకరాల చెరువులో కలిపి చేపలు సాగు చేస్తున్నారు.” సదరు భూమిపై విచారణ చేపట్టి తిరిగి తనకు అప్పగించాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు.
మార్కాపురం జిల్లా, పెద్దారవీడు మండలం, పోతంపల్లె గ్రామానికి చెందిన. చెంకెల పాలంకి రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “గ్రామంలోని సర్వే నెం. 68, సర్వే నెం. 345లో మాకు వారసత్వంగా కొంత భూమి సంక్రమించింది. నేను చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాను. దీంతో వైసీపీ నాయకులు నాపై కక్ష కట్టారు. నావలనే గ్రామంలో ఓట్లు చీలిపోయాయని పగ పెంచుకున్నారు. సదరు సర్వే భూమిలో ఈ మధ్య ప్రభుత్వం వారు రీ-సర్వే చేస్తున్నారు. మా భూమిని కూడా రి సర్వే చేయమనగా వైసీపీ పార్టీకి చెందిన సుమారు 10మంది వరకు అడ్డుకుంటున్నారు. ఎదురు తిరిగితే మా కుటుంబ సభ్యులపై కర్రలతో, రాళ్లతో దాడి చేయుటకు మూకుమ్ముడిగా వచ్చారు. వాళ్లతో మాకు ప్రాణ హాని ఉంది.” దీనిపై విచారణ చేపట్టి తమ కుటుంబానికి రక్షణగా నిలవాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు.
కర్నూలు పట్టణ కేంద్రం జోహరాపురం గ్రామానికి చెందిన శివ ప్రియ నగర్, సర్వే నెం. 161, ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ వారు గ్రీవెన్స్ లో అర్జీ ఇస్తూ.. “మేము గత 30 సంవత్సరాల క్రితం జోహరాపురం గ్రామానికి సంబంధించిన శివ ప్రియ నగర్ సర్వే నెంబరు. 161లో 11.27 ఎకరముల విస్తీర్ణములో భూమి కొనుగోలు చేశాం. అందులో గుడిసెలు నిర్మించుకున్నాం. వాటికి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు, కరెంటు బిల్లుల కూడా కడుతున్నాము. సదరు స్థలాన్ని పి. బంగారయ్య అనే వ్యక్తి ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు. దీనిపై మేము కోర్టుకు కూడా వెళ్లాం. కానీ వాళ్లు న్యాయస్థానం ఉత్తర్వులు పట్టించుకోకుండా మరి కొందరికి ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు. దీనిపై ఉన్న డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నెం. 4357/2026, డబుల్ జి. పి. ఎలను రద్దు చేయాలి” అని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా కోడూరు మండల శివారు గ్రామాలైన హరిపురం, ఉల్లిపాలెం, వేణుగోపాలపురం సాలెంపాలెం గ్రామాల చెందిన కొందరు రైతులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి.. “ తమ నాలుగు గ్రామాలకు ఈ డొంక రోడ్ కు ఇరువైపుల సుమారు 400 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఈ గ్రామాల రైతులు పండించిన పంటను బయటికి తీసుకురావటానికి ఈ రోడ్డు మార్గమే సాయపడుతుంది. పొలాలు నుంచి పశుగ్రాసం తీసుకురావాలన్న చాలా ఇబ్బందిగా ఉంది.” ఈ సమస్యపై దృష్టి పెట్టి నాలుగు గ్రామాలకు ఉపయోగపడేలా రోడ్డు నిర్మించాలని అర్జీ ఇచ్చారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react