TDP: వైసీపీకి భారీ షాక్! లక్కిరెడ్డిపల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు!
TDP: తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన పలువురు కుటుంబాలు టీడీపీలో చేరారు. లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామం వడ్డేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి.
వైసీపీకి చెందిన పలువురు కుటుంబాలు టీడీపీలో చేరిక..
అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై టీడీపీలోకి వలసలు..
రాయచోటి: తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన పలువురు కుటుంబాలు టీడీపీలో చేరారు. లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామం వడ్డేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కుటుంబాలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మంత్రి స్వయంగా వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసమే తెలుగుదేశం పార్టీకి బలమని, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో అటవీ శాఖ డైరెక్టర్ వై. పెద్ద రెడ్డయ్య యాదవ్, మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్, క్లస్టర్ కన్వీనర్ శంకారపు జయరాం, లక్కిరెడ్డిపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీరాజు, చెరువు చైర్మన్ మోహన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంతో లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గ్రామాల్లో టీడీపీ బలం రోజురోజుకూ పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.
Be the first to react